हिन्दी | Epaper
గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు నేతన్నలకు త్రిఫ్ట్ నిధులు విడుదల నిరుద్యోగ యువతకు అవకాశం: ఉచిత శిక్షణతో ఉద్యోగ భరోసా బస్సు బోల్తా.. 10 మందికి గాయాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు నేతన్నలకు త్రిఫ్ట్ నిధులు విడుదల నిరుద్యోగ యువతకు అవకాశం: ఉచిత శిక్షణతో ఉద్యోగ భరోసా బస్సు బోల్తా.. 10 మందికి గాయాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు నేతన్నలకు త్రిఫ్ట్ నిధులు విడుదల నిరుద్యోగ యువతకు అవకాశం: ఉచిత శిక్షణతో ఉద్యోగ భరోసా బస్సు బోల్తా.. 10 మందికి గాయాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు నేతన్నలకు త్రిఫ్ట్ నిధులు విడుదల నిరుద్యోగ యువతకు అవకాశం: ఉచిత శిక్షణతో ఉద్యోగ భరోసా బస్సు బోల్తా.. 10 మందికి గాయాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం అయ్యో పండగవేళ ఊరంతా కాలి బూడిదైంది రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు

Telugu News: Surya Kumari-రాష్ట్రంలో కొత్తగా 13 వృద్ధాశ్రమాలు

Sushmitha
Telugu News: Surya Kumari-రాష్ట్రంలో కొత్తగా 13 వృద్ధాశ్రమాలు

పాఠశాలలకు అంగన్వాడీలను(Anganwadi) అనుసంధానించేలా జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి సూర్య కుమారి సూచించారు. సచివాలయంలో జరిగిన కలెక్టర్ల సదస్సులో ఆమె తన శాఖకు సంబంధించిన కార్యకలాపాలపై ప్రజంటేషన్ ఇచ్చారు. అంగన్వాడీల్లో ఆరు సంవత్సరాలు పైబడిన పిల్లలు ఇంకా అక్కడే ఉండిపోతున్నారని, వారంతా బడి ఈడు పిల్లలని, వెంటనే పాఠశాలల్లో చేర్పించేలా కలెక్టర్లు దృష్టి సారించాలని ఆమె ఆదేశించారు. అంగన్వాడీల నిర్వహణలో పారదర్శకత, జవాబుదారీతనం తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని ఆమె స్పష్టం చేశారు.

కొత్త వృద్ధాశ్రమాలు, తండ్రుల భాగస్వామ్యం

అంగన్వాడీల్లో విప్లవాత్మక సంస్కరణలు చేపడుతున్నామని సూర్యకుమారి తెలిపారు. ఇప్పటివరకు తల్లులు, బిడ్డలకే పరిమితమైన అంగన్వాడీ కార్యక్రమాల్లో తండ్రులను కూడా భాగస్వామ్యం చేస్తున్నామని, బిడ్డ బాధ్యత తల్లితో పాటు తండ్రికి కూడా ఉంటుందని అవగాహన కల్పిస్తామని చెప్పారు. అంగన్వాడీల్లో దివ్యాంగులైన పిల్లల కోసం లిఫ్ట్‌లు లేదా ర్యాంపులు ఏర్పాటు చేయవచ్చని, దీనికి ప్రత్యేకంగా నిధులు కూడా ఉన్నాయని తెలిపారు. రాష్ట్రంలో ‘ఆటల్ వయో అభ్యుదయ యోజన'(plan‘) పథకం కింద కొత్తగా మరో 13 వృద్ధాశ్రమాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.

Surya Kumari

అంగన్వాడీ హాజరు, పోషన్ మా కార్యక్రమం

అంగన్వాడీల్లో మరుగుదొడ్లు, మంచినీటి కొళాయిల ఏర్పాటులో లక్ష్యాలను ఇంకా పూర్తిగా చేరుకోలేదని ఆమె పేర్కొన్నారు. ఈ నెల 17 నుండి ‘రాష్ట్రీయ పోషన్(‘National Potion‘) మా’ కార్యక్రమం ప్రారంభమవుతుందని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. అంగన్వాడీల్లో పిల్లల హాజరు 65 శాతం కంటే తక్కువ ఉన్న జిల్లాల్లో కృష్ణా, పల్నాడు, పశ్చిమ గోదావరి జిల్లాలు అట్టడుగున ఉన్నాయని, ఈ జిల్లాల కలెక్టర్లు దీనిపై దృష్టి పెట్టాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ‘కిశోరీ వికాసం’ కింద మెంటార్ సేవలను వినియోగిస్తున్నామని, ప్రైవేటు స్కూళ్ళలో అత్యధికంగా డ్రగ్స్ బాధితులు, ఆత్మహత్యలు జరుగుతున్నందున అక్కడ కూడా ఈ మెంటార్ల సేవలను వినియోగించుకోవాలని ఆమె సూచించారు.

అంగన్వాడీల నిర్వహణపై ప్రభుత్వం తీసుకుంటున్న కొత్త చర్యలు ఏమిటి?

అంగన్వాడీల నిర్వహణలో పారదర్శకత పెంచడానికి, తండ్రులను కూడా భాగస్వాములను చేస్తున్నారు.

రాష్ట్రంలో కొత్తగా ఎన్ని వృద్ధాశ్రమాలు ఏర్పాటు చేయనున్నారు?

‘ఆటల్ వయో అభ్యుదయ యోజన’ పథకం కింద కొత్తగా 13 వృద్ధాశ్రమాలు ఏర్పాటు చేస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/tg-group-1-dont-play-politics-with-childrens-future/telangana/548707/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870