📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Sujana Chowdary: సుజనా చౌదరికి విజయవంతంగా సర్జరీ పూర్తి

Author Icon By Anusha
Updated: May 7, 2025 • 2:05 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్ సీనియర్ పొలిటీషియన్, విజయవాడ వెస్ట్ బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరికి హైదరాబాద్‌లోని ప్రైవేట్‌ ఆసుపత్రిలో సర్జరీ విజయవంతంగా పూర్తి చేశారు.ఆయన లండన్‌ పర్యటనలో ప్రమాదవశాత్తు జారిపడటంతో కుడిచేయికి తీవ్రగాయమైంది.అయితే ఆయన చేతికి ఫ్రాక్చర్‌ అయినట్లు గుర్తించారు. వెంటనే ఆయన్ను లండన్ నుంచి హైదరాబాద్‌కు తీసుకొచ్చారు.బేగంపేటలోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు,అక్కడ ఆ ఆసుపత్రి ఎండీ, చీఫ్‌ రోబోటిక్‌ జాయింట్‌ రీప్లేస్‌మెంట్‌ సర్జన్‌ డాక్టర్ ఏవీ గురవారెడ్డి నేతృత్వంలో నలుగురు డాక్టర్లు నాలుగు గంటల పాటు సుజనా చౌదరికి సర్జరీ చేశారు.లండన్‌ పర్యటనలో సుజనా చౌదరి జారి కింద పడిపోవడంతో ఆయన షోల్డర్‌ హ్యుమరస్‌లో ఫ్రాక్చర్‌ (ఐదారు ముక్కలు) అయిందని డాక్టర్ గురవారెడ్డి తెలిపారు. సుజనా చౌదరికి విరిగిన ఎముకను యథాస్థానానికి చేర్చి ప్లేట్లు అమర్చి సర్జరీ విజయవంతంగా నిర్వహించామని గురవారెడ్డి చెప్పారు. నెల నుంచి రెండు నెలల పాటు ఆయనకు ఫిజియోథెరపీ అవసరం అవుతుందన్నారు.ఆయన త్వరగా కోలుకుంటారన్నారు,ఆ తర్వాత ఆయన ఆ చేతితో అన్ని పనులూ యథావిధిగా చేసుకోవచ్చని చెప్పారు. ఈ మేరకు డాక్టర్ గురవారెడ్డి ఓ వీడియోను విడుదల చేశారు.హెల్త్ అప్డేట్ ఏంటో చెప్పారు,సుజనా చౌదరి లండన్ పర్యటనకు వెళ్లిన సమయంలో అక్కడ జారిపడినట్లు తెలుస్తోంది,చేయికి తీవ్ర గాయం కావడంతో వెంటనే హైదరాబాద్‌కు తరలించారు.

ఆరోగ్యం

వాస్తవానికి సుజనా చౌదరి ఈ నెల 2న కూడా విజయవాడలో ఉన్నారు ఆ రోజు అమరావతికి వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి గన్నవరం ఎయిర్‌పోర్టులో ఘనస్వాగతం పలికారు. అయితే ఆ తర్వాత ఆయన లండన్ వెళ్లినట్లు తెలుస్తోంది,అక్కడ ఆయన గాయపడ్డారు. సుజనా చౌదరి ఆరోగ్యంపై బీజేపీ నేతలు, కార్యకర్తలు ఆరా తీశారు,సర్జరీ విజయవంతం కావడంతో ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. సుజనా చౌదరి టీడీపీలో చేరి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.ఆ తర్వాత రాజ్యసభ ఎంపీగా పదవి దక్కింది,2014లో కేంద్రమంత్రిగా కూడా పనిచేశారు. 2019 ఎన్నికల ఫలితాల తర్వాత ఆయన బీజేపీలో చేరారు,2024 ఎన్నికల్లో సుజనా చౌదరి విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీచేసి 47,032 ఓట్ల ఆధిక్యతతో గెలిచారు.

Read Also : Andhra Pradesh: ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే ఎక్కడంటే?

#AccidentRecovery #BJPMLA #RoboticSurgery #SujanaChowdary #VijayawadaWest Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.