हिन्दी | Epaper
స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

AP Govt : ఏపీలో స్పౌజ్ పింఛ‌న్లు… ఈరోజు నుంచి ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ‌

sumalatha chinthakayala
AP Govt : ఏపీలో స్పౌజ్ పింఛ‌న్లు… ఈరోజు నుంచి ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ‌

AP Govt : ఏపీలోని టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. స్పౌజ్‌ కేటగిరీ కింద కొత్తగా దాదాపు 90 వేల పింఛన్ల మంజూరుకు ఆమోదం తెలిపింది. ఇందుకు దరఖాస్తులను స్వీకరించేందుకు సిద్దమైంది. నేటి నుంచే ఇందుకు సంబంధించిన వివరాల నమోదు ప్రక్రియ ప్రారంభం కానుంది. వివరాలు… రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక పెన్షన్ల తనిఖీ చేపట్టిన ప్రభుత్వం అర్హులైన వారికి అందేలా చర్యలు చేపడుతుంది. ఎన్టీఆర్‌ భరోసా కింద పింఛన్‌ పొందుతున్న వారి స్థానంలో వారిపై ఆధారపడిన భార్య లేదా భర్తకు పెన్షన్లు మంజూరు చేస్తున్నారు. దీన్నే స్పౌజ్‌ కేటగిరీగా గుర్తిస్తూ గతేడాది నవంబరు నుంచే అమలు చేస్తున్నారు. లబ్ధిదారులకు రూ.4 వేల చొప్పున పింఛన్ చెల్లిస్తున్నారు.

ఏపీలో స్పౌజ్ పింఛ‌న్లు ఈరోజు

అర్హులైన వారికి కూడా మే 1 నుంచి పింఛన్

2023 డిసెంబరు 1 నుంచి 2024 అక్టోబరు 31 మధ్య ఉన్న ఇదే కేటగిరీలో పెన్షన్లు కోల్పోయిన అందించాలని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) తాజాగా ఆదేశాలు ఇచ్చింది. 89,788 వితంతువులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు మంజూరు చేసింది. తాజా నిర్ణయంతో ప్రభుత్వ ఖజానాపై నెలకు రూ.35.91 కోట్ల అదనపు భారం పడనుంది. అర్హురాలైన మహిళ.. భర్త మరణ ధ్రువీకరణ పత్రంతో పాటు తన ఆధార్‌ కార్డు తదితర వివరాలను గ్రామ, వార్డు సచివాలయాల్లో అందించాల్సి ఉంటుంది. ఏప్రిల్‌ 25 నుంచి గ్రామ, వార్డు సచివాలయాల్లో ఈ వివరాలు స్వీకరిం చనున్నారు. అర్హులు ఈ నెల 30లోపు ఈ వివరాలు సమర్పిస్తే, మే 1న పింఛను సొమ్ము అందుతుంది. అయితే ఏప్రిల్ 30 తర్వాత నమోదు చేసుకున్నవారికి జూన్‌ 1 నుంచి పింఛన్ చెల్లింనున్నారు.

గతంలో ఇచ్చిన రూ.3 వేల పింఛన్‌ను రూ. 4 వేలకు పెంచింది.

ఇక, ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే… వృద్ధాప్య, వితంతు, చేనేత, కల్లు గీత, మత్స్యకార, ఒంటరి మహిళ, ట్రాన్స్‌జండర్‌, హెచ్‌ఐవీ బాధితులు, డప్పు కళాకారులకు గతంలో ఇచ్చిన రూ.3 వేల పింఛన్‌ను రూ. 4 వేలకు పెంచింది. అలాగే దివ్యాంగులకు ఇచ్చే పింఛన్‌ను రూ. 3 వేల నుంచి రూ. 6 వేలకు పెంచారు. పూర్తిస్థాయిలో అస్వస్థతకు గురైన వారికి, పూర్తి వైకల్యంతో కదల్లేని స్థితిలో ఉన్నవారికి ఇచ్చే పింఛన్‌ను రూ.5 వేల నుంచి రూ.15 వేలు చేశారు. కిడ్నీ, కాలేయం, గుండె మార్పిడి చేసుకున్న వారికి, డయాలసిస్‌ స్టేజ్‌కు ముందున్న కిడ్నీ వ్యాధిగ్రస్తులకు పింఛను కింద అందే రూ.5 వేలను రూ.10 వేలకు పెంచారు.

Read Also: రేపు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం చంద్రబాబు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870