📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Spouse Pension: ఆంధ్రాలో వితంతు పింఛన్లు వాయిదా..ఎందుకంటే?

Author Icon By Anusha
Updated: June 12, 2025 • 1:14 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్‌లో స్పౌజ్ పింఛన్ల పంపిణీని తాత్కాలికంగా వాయిదా వేసినట్లు అధికారులు తెలిపారు.ప్రభుత్వం ఇటీవలే కొత్తగా స్పౌజ్ (భర్త మరణించిన తర్వాత భార్యకు ఇవ్వబడే) పింఛన్లను మంజూరు చేసింది.నేటితో (జూన్ 12) కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తైన సందర్భంగా పింఛన్లు పంపిణీ చేయాలని భావించారు. కానీ ఇవాళ సుపరిపాలన-స్వర్ణాంధ్ర కార్యక్రమానికి ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరవుతున్నారు. ఈ కారణంగానే స్పౌజ్ పింఛన్‌(Spouse Pension)ల పంపిణీని వాయిదా వేస్తున్నట్లు సెర్ప్‌ అధికారులు తెలిపారు.

కొత్త విధానాన్ని

తదుపరి స్పౌజ్ కేటగిరి పింఛన్ పంపిణీ తేదీని త్వరలోనే చెబుతామన్నారు. మరి ఈ పింఛన్‌ పంపిణీ ఈ నెలలోనే ఉంటుందా వచ్చే నెల ఒకటో తేదీన ఇస్తారా అన్నది చూడాలి.భర్త చనిపోతే, భార్యకు వెంటనే పింఛను వచ్చేలా కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. ఈ విధానానికి స్పౌజ్ కేటగిరీగా నిర్ణయించారు. ఒక్కొక్కరికి రూ.4 వేల చొప్పున పింఛను అందిస్తారు. భర్త చనిపోయిన వెంటనే భార్యకు పింఛను ఇవ్వడానికి ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. భర్త మరణ ధ్రువీకరణ పత్రం ఇస్తే చాలు, వెంటనే స్పౌజ్ కేటగిరీలో పింఛను మంజూరు చేస్తారు.

పింఛను ఇవ్వాలని

2023 డిసెంబరు నుంచి ఈ స్పౌజ్ కేటగిరీ కింద 71,340 మంది అర్హులు ఉన్నారని గుర్తించారు. వీరికి నెలకు రూ.4 వేల చొప్పున పింఛను ఇవ్వాలని నిర్ణయించారు. ప్రభుత్వం రూ.29.60 కోట్లు విడుదల చేసింది. స్థానిక ప్రజా ప్రతినిధులు గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పింఛను డబ్బులు ఇవ్వాలని భావించారు. కానీ ఆ నిర్ణయాన్ని వాయిదా వేశారు.

Spouse Pension

దరఖాస్తుల నమోదు

సామాజిక భద్రత పింఛనుదారుల భార్యలకు స్పౌజ్ పింఛన్లు అందించేందుకు చర్యలు చేపట్టింది. 2023 డిసెంబరు 1 నుంచి 2024 అక్టోబరు 31 మధ్య మరణించిన పింఛనుదారుల భార్యలకు ఈ పింఛన్లు ఇస్తున్నారు. దరఖాస్తుల నమోదు కోసం ఏప్రిల్‌‌లో ప్రత్యేక పోర్టల్(special portal) ప్రారంభించారు. 2024 నవంబరు నుంచి మరణించిన పింఛనుదారుల భార్యలు కూడా స్పౌజ్ పింఛన్ల కోసం గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు.

తిరస్కరణ

ప్రభుత్వం ఈ దరఖాస్తులను పరిశీలించి పింఛన్లకు ఆమోదం తెలిపింది. కొందరు లబ్ధిదారుల భార్యలు వేరే ప్రాంతాలకు వెళ్లిపోవడం వల్ల దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. మరికొందరు ఇప్పటికే పింఛను పొందుతున్నారు. ఇంకొందరు భర్త మరణ ధ్రువీకరణ పత్రాలు తీసుకురాలేదు. హౌస్ మ్యాపింగ్‌లో భార్య, భర్త వేర్వేరు కుటుంబాలుగా చూపడం కూడా తిరస్కరణకు కారణమైంది. కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నవారు ఉండటం, లింగనిర్ధారణలో తప్పులు వంటి కారణాల వల్ల కూడా కొన్ని స్పౌజ్ పింఛన్ దరఖాస్తులు తిరస్కరించారు.

Read Also: Anakapalli: పరవాడ ఫార్మాసిటీ కంపెనీలో గ్యాస్ లీక్

#AndhraPradesh #APGovernment #PensionUpdate #SpousePension Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.