Vijayasai Reddy : మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి సిట్‌ నోటీసులు

Read Time:  1 min
SIT notices issued to former MP Vijayasai Reddy
SIT notices issued to former MP Vijayasai Reddy
FONT SIZE
GET APP

Vijayasai Reddy : వైసీపీ ప్రభుత్వ హయాంలో మద్యం పాలసీ లో జరిగిన అవకతవకలపై తాజాగా విచారణ కొనసాగుతోంది. పై టీడీపీ ఎంపీ ఏకంగా పార్లమెంట్ లో ప్రస్తావించడంతో ఈ కేసు సంచలనంగా మారింది. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ కుంభకోణం పై విచారించేందుకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్‌)ను ఏర్పాటు చేసింది. కాగా ఈ కేసులో ఆరోపణలను ఎదుర్కొంటున్న మాజీ వైసీపీ నేత విజయసాయి రెడ్డికి తాజాగా సిట్ నోటీసులు జారీ చేసింది.

మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి సిట్‌

కసిరెడ్డికి కూడా నోటీసులు

ఈ నెల 18న విజయవాడలోని సీపీ ఆఫీసులో విచారణకు హాజరు కావాలని సిట్ నోటీసుల్లో పేర్కొంది. ఎందుకంటే విజయసాయి రెడ్డి అప్పుడు ప్రభుత్వ సలహాదారుగా ఉన్నారు. కాగా ఈ మద్యం కుంభకోణం కేసులో నిందితుడు అయిన కసిరెడ్డి ఇల్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ తో పాటు పలు ప్రాంతాల్లో సుమారు 10 నుంచి 15 సిట్ బృందాలు తనిఖీలు చేశారు. ఈ కేసులో కసిరెడ్డికి కూడా నోటీసులు ఇచ్చారు.

మద్యం లైసెన్స్‌ల కేటాయింపులో అవకతవకలు

2019-2024 మధ్య వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఏపీలో మద్యం విధానం లో అవకతవకలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. మద్యం లైసెన్స్‌ల కేటాయింపులో అవకతవకలు, నకిలీ మరియు నాసిరకం మద్యం ఉత్పత్తి, అమ్మకాలు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా బినామీ డిస్టిలరీల నుండి సబ్-స్టాండర్డ్ మద్యం కొనుగోలు చేశారు. దీంతో రూ. 20,000 కోట్లకు పైగా ఆర్థిక నష్టంతో పాటు రూ. 4,000 కోట్ల వరకు కిక్‌బ్యాక్‌లు (లంచాలు) సేకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. నాసిరకం మద్యం వల్ల ఆరోగ్య సమస్యలు, ఆల్కహాల్ వ్యసనం వల్ల ఆత్మహత్యలు పెరిగాయని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డేటా సూచిస్తోంది.

Read Also: నేడు ఏపీ కేబినెట్ సమావేశం.. ఈ అంశాలపై చర్చ!

sumalatha chinthakayala

రచయిత గురించి

sumalatha chinthakayala

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.