📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఆరుకు చేరిన కల్తీపాల మృతులు సునీల్ నాయక్ కు హైకోర్టులో చుక్కెదురు ఎఐ వినియోగంపై చంద్రబాబు సమీక్ష ఈ నెల 7వ తేదీ తర్వాత కోస్తాంధ్రలో వర్ష సూచన క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం ఆరుకు చేరిన కల్తీపాల మృతులు సునీల్ నాయక్ కు హైకోర్టులో చుక్కెదురు ఎఐ వినియోగంపై చంద్రబాబు సమీక్ష ఈ నెల 7వ తేదీ తర్వాత కోస్తాంధ్రలో వర్ష సూచన క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం

Simhachalam : కోటి డిమాండ్ చేస్తున్న బాధితులు

Author Icon By Sudheer
Updated: April 30, 2025 • 3:55 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విశాఖపట్నం సింహాచలం ఆలయంలో జరిగిన చందనోత్సవంలో గోడ కూలిన విషాద ఘటనలో ఎనిమిది మంది భక్తులు ప్రాణాలు కోల్పోవడంతో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతి నెలకొంది. ఈ నేపథ్యంలో కేజీహెచ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను హోంమంత్రి వంగలపూడి అనిత పరామర్శించారు. ఆమెను ఎదుర్కొన్న బాధిత కుటుంబాలు ఒక్కో కుటుంబానికి కనీసం కోటి రూపాయల పరిహారం ఇవ్వాలంటూ డిమాండ్ చేశాయి. తమ ప్రాణాలను కోల్పోయిన కుటుంబ సభ్యుల స్థాయికి తగిన న్యాయం జరగాలంటూ బాధితులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

రూ.25 లక్షల పరిహారం

ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మీడియాతో మాట్లాడుతూ.. బాధితుల డిమాండ్లను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని, ప్రభుత్వం ఇప్పటికే రూ.25 లక్షల పరిహారంతో పాటు, ఒక్కో కుటుంబానికి ఒక ఉద్యోగాన్ని కల్పించనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా మృతుల పిల్లల విద్యాభవిష్యత్తును రాష్ట్ర ప్రభుత్వం భాద్యత తీసుకుంటుందని హామీ ఇచ్చారు. గోడ కూలిన సంఘటనపై కమిటీని ఏర్పాటు చేసి, 72 గంటల్లో నివేదిక ఇవ్వాలని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశించిందని తెలిపారు. నిర్లక్ష్యం చేసిన అధికారులపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

Read Also : Simhachalam : సింహాచలం ప్రమాదానికి కారణం అదేనా..?

గోడ నిర్మాణంలో లోపాలు

గోడ నిర్మాణంలో ఏవైనా నాణ్యతా లోపాలు ఉన్నాయా? కాంట్రాక్టు ఎవరి వద్ద ఉంది? నిర్మాణ అనుమతులు ఎలా మంజూరయ్యాయి? అనే అంశాలపై సమగ్రంగా దర్యాప్తు జరుగుతుందని హోంమంత్రి వెల్లడించారు. ఇది ఊహించని ఘటన అని, తాను కూడా వర్షం కురుస్తున్న సమయంలో అక్కడే దర్శనానికి వచ్చానని చెప్పారు. ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించామని, ఎలాంటి జాప్యం లేకుండా ప్రభుత్వ యంత్రాంగం స్పందించిందని తెలిపారు. ఈ విషాద ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్‌గా ఉందని, విచారణలో ఎవరి తప్పులైనా బయటపడితే, చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హోంమంత్రి స్పష్టంగా హెచ్చరించారు.

Chandanotsavam Google News in Telugu Simhachalam

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.