📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Savitha: తల్లికి వందనం నిధులపై ఆరోపణలు నిరూపించాలి:మంత్రి సవిత

Author Icon By Anusha
Updated: June 14, 2025 • 2:24 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తల్లికి వందనం నిధులపై వైఎస్సార్‌సీపీ ఆరోపణలను మంత్రి సవిత తీవ్రంగా ఖండించారు. తల్లికి వందనం పథకం నిధులు ఒక్కొక్కరి నుంచి రూ.2వేల చొప్పున విద్యాశాఖ మంత్రి లోకేష్ జేబులోకి వెళ్లినట్లు నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమన్నారు మంత్రి సవిత (Savitha).ఒకవేళ నిరూపించలేకపోతే పులివెందుల ఎమ్మెల్యే పదవికి వైఎస్ రాజీనామా చేయగలరా? అని సవాల్ చేశారు. వైఎస్సార్‌సీపీ ఆరోపణలు నిరూపిస్తే తాను ఎమ్మెల్యే, మంత్రి పదవికి రాజీనామా చేస్తానని జగన్‌ తన సవాల్‌ను స్వీకరిస్తారా అని ప్రశ్నించారు. 2024 ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు ఇంటిలో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం పథకం ఇచ్చి మాట నిలబెట్టుకున్నారన్నారు.

ఎంతమంది పిల్లలుంటే

గత ప్రభుత్వం చేసిన అప్పులు కట్టుకుంటూ తల్లికి వందనం పథకం ఇవ్వడం గొప్ప విషయం. ఇందులో చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్ కృషి ఎనలేనిది. ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం అందజేస్తున్నాం. ఒక్కరుంటే 13వేలు, ఇద్దరుంటే 26వేలు, ముగ్గురుంటే 36వేలు, నలుగురుంటే 52వేలు, ఐదుగురుంటే 65వేలు అందజేశాం. 2019 ఎన్నికల సమయంలో జగన్ ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి అమ్మఒడి ఇస్తామని చెప్పి అధికారంలోకి రాగానే మోసం చేశారు. ఒకరికే ఇచ్చి పరిమితులు పెట్టారు. కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకంపై పరిమితులు పెట్టలేదు, ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకు అమ్మఒడి అందజేసింది. 

మౌలిక సదుపాయాలు

గత ప్రభుత్వంతో పోలిస్తే అదనంగా దాదాపు 25 లక్షల మందికి అదనంగా తల్లికి వందనం అందజేశాం. సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరున విద్యార్థులకు కిట్లు కూడా అందజేశాం. ఆ కిట్లల్లో పిల్లలకు కావాల్సిన పుస్తకాలు, బ్యాగులు, టై, డిక్షనరీ అన్నీ కలిపి 2,220 రూపాయలు విలువ చేసే కిట్ అందజేశాం’ అన్నారు మంత్రి. మధ్యాహ్న భోజనం, సంక్షేమ హాస్టల్స్ లలో మౌలిక సదుపాయాలు కల్పించాం. అన్ని సంక్షేమ హాస్టల్స్ లకు సన్నబియ్యం సరఫరా చేస్తున్నాం. ఇంటర్ పిల్లలకు కూడా డొక్కా సీతమ్మ పేరున మళ్లీ మధ్యాహ్న భోనం అందజేస్తున్నాం. మెగా డీఎస్సీపై తొలి సంతకం అన్నాం చేసి చూపించాం.16,347 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చాం. ఇది గిట్టని వైఎస్సార్‌సీపీ నేతలు 24 కేసులు పెట్టించారు. ఈ విషయంలో సుప్రీంకోర్టుకు వెళ్లగా సుప్రీం కోర్టు కూడా వైఎస్సార్‌సీపీ మొట్టికాయలు వేసింది. 

Savitha

ప్రజలు బుద్ధి

ఎన్నికల్లో కూటమికి ప్రజలు సంపూర్ణ మెజార్టీ ఇచ్చారు. ప్రజలు ఏ నమ్మకంతో మాకు ఓట్లేశారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం. రాష్ట్రంలోని అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగుతోంది. వైఎస్సార్‌సీపీ పాలనలో అనేకమంది సలహాదారులు ఉన్నప్పటికి రాష్ట్రాభివృద్ధికి ఏమీ చేయలేదు’ అన్నారు.’ఎన్నికల్లో జగన్ (Jagan) కు ప్రజలు బుద్ధి చెప్పినా ఇంకా మారలేదు. మళ్లీ బుద్ది చెప్పడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఒక్కో విద్యార్థికి ఇచ్చే తల్లికి వందనం రూ.15 వేలల్లో పాఠశాల అభివృద్ధికి 2 వేలు, విద్యార్థుల తల్లలు ఖాతాల్లో 13 వేలు వేశారు. లోకేష్ జేబుల్లోకి తల్లికి వందనం డబ్బులు 2వేలు వెళ్లాయని చెబుతున్నారు. నా సవాల్ స్వీకరిస్తారా వైఎస్సార్‌సీపీ ప్రజల్ని డైవర్ట్ చేయాలనుకుంటుంది.

డైవర్షన్ పాలిటిక్స్

ప్రజలే మిమ్మల్ని డైవర్ట్ చేశారు. జగన్ కు ప్రతిపక్ష హోదా (Opposition status) కూడ ఇవ్వలేదంటే ప్రజల్లో జగన్ పై ఎంతటి వ్యతిరేకత ఉందో అర్థమౌతోంది. అందరికి ఇబ్బంది పెట్టారు.అనవసరంగా నిందలు వేస్తే సహించేది లేదు. ముక్కు నేలకేసి క్షమాపణ కోరాలి, డైవర్షన్ పాలిటిక్స్ మానాలి. ప్రజలు గట్టిగా గుణపాఠం చెప్పినా బుద్ధి రాలేదు. చెప్పిన విధంగా మాట నిలబెట్టుకున్నాం. కష్టకాలంలోనూ తల్లికి వందనం ఇవ్వడం గొప్ప విషయం’ అన్నారు సవిత.

Read Also: Belum Caves: ఆంద్రా బెలూం గుహలకు GSI గుర్తింపు

#LokeshFundsAllegations #MinisterSavithaChallenge #TalliKiVandanam #YSRCPvsTDP Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.