📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Sajjala Ramakrishna Reddy: కూటమి ప్రభుత్వంపై ఏడాదిలోనే వ్యతిరేకత: సజ్జల

Author Icon By Anusha
Updated: June 4, 2025 • 4:39 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రాష్ట్రంలో సీఎం చంద్రబాబు నాయుడు పాలనపై,తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది కూడా పూర్తికాకముందే,ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొన్నదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు.వైసీపీ(YCP) ఆధ్వర్యంలో జూన్ 4న రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ‘వెన్నుపోటు దినం’ నిరసన కార్యక్రమాలు విజయవంతం అయ్యాయని, ఇది ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల ఆగ్రహానికి నిలువెత్తు నిదర్శనమని వ్యాఖ్యానించారు.

అధికారంలోకి

సజ్జల నేడు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “మేము ఊహించినదానికంటే ఎక్కువగా ప్రజలు ‘వెన్నుపోటు దినం’లో పాల్గొన్నారు. ఇది చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో స్పష్టం చేస్తోంది. ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా, ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలి, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెడుతున్న తీరుపై ప్రజలు విసుగెత్తిపోయారు” అని ధ్వజమెత్తారు. చంద్రబాబు(Chandrababu) ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే లక్షన్నర కోట్ల రూపాయలకు పైగా అప్పు చేసిందని, ఈ నిధులు ఏమయ్యాయో, ఏయే వర్గాలకు ప్రయోజనం చేకూరిందో చెప్పలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని ఆయన విమర్శించారు.

ప్రభుత్వానికి హెచ్చరిక

కష్టాల నుంచి పుట్టిన పార్టీ వైసీపీ. జగన్ నాయకత్వంలో 15 ఏళ్లలో జరగాల్సిన అభివృద్ధిని కేవలం మూడేళ్లలోనే చేసి చూపించాం. అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే 99 శాతం హామీలను నెరవేర్చాం. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో కూడా సంక్షేమ పథకాలు ఆపకుండా ప్రజలను ఆదుకున్నాం. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు పెద్దపీట వేశాం” అని సజ్జల గత వైసీపీ పాలనను గుర్తుచేశారు.ప్రస్తుత టీడీపీ(TDP) ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతూ, “చంద్రబాబు పాలనలో రాష్ట్రంలోని వ్యవస్థలన్నీ సర్వనాశనమయ్యాయి. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరల్లేక అల్లాడుతున్నారు. ఇప్పటికే నాలుగు లక్షల మంది అర్హులైన వారికి పింఛన్లు కట్ చేసి వారి ఉసురు పోసుకుంటున్నారు. జగన్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాల(Welfare schemes)కు మంగళం పాడారు. ఈ తీరు చూస్తుంటే ప్రజలు తిరగబడే రోజులు ఎంతో దూరంలో లేవు. ‘వెన్నుపోటు దినం’ విజయం ప్రభుత్వానికి ఒక హెచ్చరిక” అని సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రస్థాయిలో హెచ్చరించారు. ప్రజల నుంచి వచ్చిన ఈ విశేష స్పందన, తమ భవిష్యత్ పోరాటాలకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు.

Read Also: AP Elections Results Day : ఏపీ ఎన్నికల ఫలితాలకు ఏడాది!

#AndhraPolitics #PoliticalProtest #SajjalaRamakrishnaReddy #VoiceOfThePeople #YSRCP Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.