Hostels Funding : హాస్టళ్ల నిర్వహణకు రూ.300 కోట్లు విడుదల – మంత్రి వీరాంజనేయ స్వామి

Read Time:  1 min
Hostels Funding : హాస్టళ్ల నిర్వహణకు రూ.300 కోట్లు విడుదల - మంత్రి వీరాంజనేయ స్వామి
Hostels Funding : హాస్టళ్ల నిర్వహణకు రూ.300 కోట్లు విడుదల - మంత్రి వీరాంజనేయ స్వామి
FONT SIZE
GET APP

విజయవాడ (Hostels Funding) : హస్టల్స్ నిర్వహణ, నూతన హస్టల్స్ నిర్మాణాలకు రూ. 300 కోట్లు విడుదల చేసినట్లు సంక్షేమ, వికలాంగుల సీనియర్ సిటిజన్ సంక్షేమం, సచివాలయం, గ్రామ వాలంటీర్ల వ్యవహారాల మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి (Minister Dola Bala Veeranjaneya Swamy) అన్నారు. హస్టల్స్ లో తమ పిల్లలను చేర్పించే విద్యార్థుల తల్లితండ్రుల్లో భరోసా కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామని. విజయవాడలోని తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వ ర్యంలో రీజనల్ కాన్ఫరెన్స్ను మంగళవారం నిర్వహించారు. ముఖ్యఅతిధిగా పాల్గొన్న మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి మాట్లా డుతూ వసతి గృహాల మరమత్తుల నిమిత్తం రూ. 143 కోట్లు, నూతనంగా నిర్మించే హస్టల్ భవనాలకు రూ. 100 కోట్లకు పైగా, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నుంచి దాదాపు రూ. 50 కోట్లు విడుదల చేయడం జరిందన్నారు. విద్యార్థుల విద్య, ఆరోగ్యంపై శ్రద్ధ వహించేలా చర్యలు తీసుకుంటున్నా మన్నారు. అలాగే వసతుల మెరుగుపై దృష్టి సారించామని, విద్యార్థులు ప్రశాంత వాతావర ణంలో అహ్లదకరంగా ఉంటూ చదువుపై దృష్టి నిలిపేలాచర్యలు తీసుకుంటున్నామని వివరించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో నూతనంగా హస్టల్ భవనాలు (Hostel buildings) నిర్మాణాలు చేపడుతున్నా మని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి సూచనల మేరకు సాంఘీక సంక్షేమ వసతి గృహాల్లో మెనూలో నాణ్యమైన బియ్యం అందిస్తున్నాము. ఈ ఏడాది నుండి పోస్ట్ మెట్రిక్ విద్యార్థులకు కార్పెట్, టవల్స్, బెడ్ షీట్స్ కూడా అందిస్తు న్నామన్నారు.

READ HINDI NEWS : hindi.vaartha.com

READ ALSO :

Shravan

రచయిత గురించి

Shravan

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.