Chicken Price: తగ్గిన చికెన్ ధరలు

Read Time:  1 min
Chicken Price: తగ్గిన చికెన్ ధరలు
FONT SIZE
GET APP

గత కొన్ని రోజులుగా సామాన్యుడికి చుక్కలు చూపించిన కోడిమాంసం (Chicken Price) ధరలు ఎట్టకేలకు దిగివచ్చాయి. పండగలు, తీర్థయాత్రల సీజన్‌లో కిలో చికెన్ ధరపెరిగి వినియోగదారులను తీవ్రంగా ఇబ్బంది పెట్టింది. చికెన్ ధరలు ఒక్కసారిగా పెరగడంతో మధ్యతరగతి కుటుంబాలు, చికెన్ (Chicken Price)కొనుగోలుపై వెనుకడుగు వేసిన పరిస్థితి ఏర్పడింది. నెల క్రితం వరకు కిలో స్కిన్‌లెస్ చికెన్ ధర రూ. 300 దాటగా, ఇప్పుడు అది ప్రాంతాన్ని బట్టి రూ. 220 నుంచి రూ. 250 మధ్యకు చేరింది. లైవ్ కోడి ధర సైతం కిలో రూ. 140 వద్ద నిలకడగా కొనసాగుతోంది.

Read Also: Sonu Sood: ముగ్గురు అక్కాచెల్లెళ్లు సూసైడ్.. స్పందించిన నటుడు

Reduced chicken prices
Reduced chicken prices

ధరలపై ప్రభావం

పౌల్ట్రీ ఫారాల్లో ప్రస్తుతం కోళ్ల ఉత్పత్తి ఆశాజనకంగా ఉండటం, డిమాండ్‌కు మించి లభ్యత ఉండటమే ఈ ధరల తగ్గుదలకు ప్రధాన కారణమని వ్యాపార వర్గాలు విశ్లేషిస్తున్నాయి. హోటళ్లు, ఫంక్షన్ల నుంచి ఆర్డర్లు సాధారణంగా ఉన్నప్పటికీ, గృహ అవసరాల కోసం కొనేవారి సంఖ్య కొంత తగ్గడం కూడా ధరలపై ప్రభావం చూపింది.కేవలం మాంసం మాత్రమే కాకుండా, గతంలో ఎన్నడూ లేని విధంగా కిలో రూ. 9కి చేరిన కోడిగుడ్డు ధర కూడా ఇప్పుడు రూ. 6కు పడిపోయింది. పౌల్ట్రీ యజమానుల అంచనా ప్రకారం.. రాబోయే రోజుల్లో ఉత్పత్తి మరిన్ని రెట్లు పెరిగే అవకాశం ఉండటంతో, ధరలు ఇంకా తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.