📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Andhra Pradesh: 50ఏళ్లు దాటిన అవివాహిత మహిళలకు రేషన్ కార్డు జారీ

Author Icon By Anusha
Updated: May 15, 2025 • 1:00 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఏపీ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తున్న సంగతి తెలిసిందే. కొత్త రేషన్ కార్డుల కోసం ఇప్పటికే దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. మే 8 నుంచి రేషన్ కార్డుల దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. రేషన్ కార్డు కావాల్సిన వారు గ్రామ, వార్డు సచివాలయాలను సందర్శించి, తగిన వివరాలు అందించి రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మే 15 నుంచి మన మిత్ర వాట్సాప్ గవర్నె్న్స్(WhatsApp Governance) ద్వారా కూడా రేషన్ కార్డు సేవలు అందిస్తామని ఏపీ ప్రభుత్వం ఇప్పటికే వెల్లడించింది. మరోవైపు రేషన్ కార్డులకు సంబంధించి తాజాగా మరో అప్‌డేట్ అందుతోంది. కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తుతో పాటుగా ఇప్పటికే కార్డు ఉన్నవారికి కూడా అవకాశం కల్పిస్తున్నారు.కొత్తగా పెళ్లైన జంటలు, లేదా ఇప్పటికే ఒక కుటుంబంలో ఉంటూ వేరు కాపురం వెళ్లిన వారు, తమ కార్డులను విభజించుకోవాలనుకుంటారు. అలాంటి వారి కోసం ఈ అవకాశం కల్పిస్తున్నారు. అయితే ఇలాంటి సేవ పొందడం కోసం గతంలో వివాహ ధ్రువీకరణ పత్రం(Marriage certificate అడిగేవారు. అయితే ఇప్పుడు మ్యారేజీ సర్టిఫికేట్ అవసరం లేదని ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు ఎక్స్(X) వేదికగా నాదెండ్ల మనోహర్ ట్వీట్ చేశారు. అలాగే స్వచ్ఛందంగా రేషన్ కార్డు వదులుకునే అవకాశం కల్పించినట్లు వివరించారు.మరోవైపు వివాహం కాకుండా 50ఏళ్లు దాటి ఒంటరిగా జీవిస్తున్న వారికి కూడా ఈసారి రేషన్ కార్డులు అందివ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.

50ఏళ్లు దాటిన అవివాహిత మహిళలకు రేషన్ కార్డు జారీ

ప్రభుత్వం

అలాగే ఆశ్రమాల్లో ఉంటున్నవారికి కూడా రేషన్ కార్డులు జారీ చేయనున్నారు. ఇక దేశంలోనే తొలిసారిగా లింగమార్పిడి చేయించుకున్న వాళ్లకు సైతం ఏపీ ప్రభుత్వం కొత్త రేషన్‌ కార్డు(New ration card)లు మంజూరు చేయనుంది. వీటితోపాటుగా రాష్ట్రంలోని ఇబ్బందుల్లో ఉన్న కళాకారులు, అంతరించిపోతున్న కళలకు ప్రాణం పోస్తున్న వారికి అంత్యోదయ అన్నయోజన కార్డు(Antyodaya Anna Yojana Card)లు అందించనున్నారు. ఈ కార్డు కింద ప్రతినెలా 35 కేజీల బియ్యం అందిస్తారు. ఏలూరు, అల్లూరి జిల్లాల్లోని కొండప్రాంతాల్లో ఉండే 12 కులాల గిరిజనులు, చెంచులకు కూడా అంత్యోదయ అన్నయోజన కార్డులు అందించనుంది ఏపీ ప్రభుత్వం. రేషన్ కార్డులు కావాల్సిన వారు గ్రామ, వార్డు సచివాలయాల ద్వారానే కాకుండా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కూడా రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకునే వీలు కల్పిస్తోంది.

Read Also : Andhra Pradesh: ఏపీలో సినిమా టికెట్ల ధరలపై ప్రభుత్వం కీలక నిర్ణయం

#AndhraPradesh #apgovt #InclusiveWelfare #RationCardForAll #SocialWelfare Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.