Ram Mohan Naidu: భోగాపురం ఎయిర్‌పోర్ట్ 86% పూర్తి, 2026 జూన్ నుంచి ఫ్లైట్‌లు

Read Time:  1 min
Ram Mohan Naidu
Ram Mohan Naidu
FONT SIZE
GET APP
Alluri Sitaramaraju International Airport Updates: భోగాపురం ఎయిర్‌పోర్ట్ పనులు వేగవంతం

భోగాపురం ఎయిర్‌పోర్ట్ పనుల పురోగతి

విజయనగరం జిల్లాలోని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణంలో 86% పనులు పూర్తియ్యాయని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు(Ram Mohan Naidu) శనివారం ప్రకటించారు. భోగాపురం ఎయిర్‌పోర్ట్ పనులను పరిశీలించిన ఆయన అధికారులు, నిర్మాణ పురోగతిని వివరించారు.

2026 జూన్ నుంచి విమాన సర్వీసులు

కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు(Ram Mohan Naidu) ప్రకటించిన వివరాల ప్రకారం, భోగాపురంఎయిర్‌పోర్టు 2026 జూన్ నుంచి ఫ్లైట్ సేవలను ప్రారంభించనుంది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందుబాటులోకి రాబోయే మరో కొత్త ఎయిర్‌పోర్ట్ అవుతుంది. ప్రస్తుతానికి రాష్ట్రంలో ఏడు విమానాశ్రయాలు మాత్రమే పనిచేస్తున్నాయి.

విశాఖపట్నం నుంచి భోగాపురం(Bhogapuram)విమానాశ్రయానికి రోడ్డు అనుసంధానం ఇప్పటికే సమీక్షించబడింది. ఏప్రిల్ 2026 నాటికి రహదారి పనులు పూర్తిచేయాలని లక్ష్యం పెట్టబడింది. అదనంగా, విశాఖపట్నంలో బీచ్ కారిడార్ నిర్మాణం కోసం సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక రూపొందిస్తున్నట్లు కూడా మంత్రి తెలిపారు.

Ram Mohan Naidu

ఎయిర్‌పోర్ట్ నిర్మాణ వివరాలు

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం రెండు దశల్లో నిర్మించబడుతుంది. తొలి దశలో ₹4,592 కోట్లతో 22 ఏరో బ్రిడ్జ్‌లు, టెర్మినల్ బిల్డింగ్ నిర్మించబడతాయి. మొత్తం 2,203 ఎకరాల్లో ఎయిర్‌పోర్టు నిర్మాణం జరుగుతోంది. ఆ తర్వాత, ఏపీ ప్రభుత్వం అదనంగా 500 ఎకరాలు భూమి కేటాయించింది.

ప్రయాణికుల కోసం సర్వీసులు

ఎయిర్‌పోర్ట్ ప్రారంభంలో ఏటికి 60 లక్షల ప్రయాణికులు సదుపాయం పొందగలుగుతారు. తర్వాత క్రమానుగతంగా, ఈ సంఖ్య నాలుగు కోట్ల వరకు పెంచాలని కేంద్రం భావిస్తోంది.

Read Also:

https://vaartha.com/auto-drivers-thank-mla-coalition-government-mla-varla-kumar-raja/andhra-pradesh/546523/

Digital

రచయిత గురించి

Digital

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.