News Telugu: Rain Alert: రేపు ఎల్లుండి ఆంధ్రాకు భారీ వర్షాలు

Read Time:  1 min
Rain Alert
Rain Alert
FONT SIZE
GET APP

Rain Alert: మనస్వార్థం బట్టి ప్రకృతి వికృతిగా మారుతున్నది. మనం భూమికి మేలు చేస్తే, అది మనకు మేలు చేస్తుంది. మనంకీడు చేస్తే అది కూడా మనకు కీడే చేస్తుంది. ప్రస్తుతం వాతావరణ (weather) పరిస్థితులను చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. అక్టోబరు, నవంబరు మాసమంటే శీతాకాలం. కానీ విచిత్రం ఏమిటంటే నిత్యం అల్పపీడనాలతో ఎడతెరపీ లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఆగస్టు, సెప్టెంబర్ మాసంలో ఒకవైపు నైరుతీ రుతుపవనాలతో వర్షాలు మరోవైపు బంగాళాకాతంలో ఏర్పడుతున్న అల్పపీడనాలతో వద్దంటే వర్షాలు పడుతున్నాయి. తాజాగా ఆదివారం వాతావరణశాఖ బాంబు పేల్చింది. ఆగ్నేయ బంగాళాఖాతo (Bay of Bengal) లో ఏర్పడిన తీవ్ర వాయుగుండం రానున్న 12 గంటల్లో తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది.

Read also: Montha Cyclone: మొంథా తుపాన్‌ ప్రభావం – ఏపీలో భారీ వర్షాలు

Rain Alert: రేపు ఎల్లుండి ఆంధ్రాకు భారీ వర్షాలు

Rain Alert: రేపు ఎల్లుండి ఆంధ్రాకు భారీ వర్షాలు

గంటకు 110 కి.మీల వేగంతో పెనుగాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు తప్పనిసరి అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. రేపు ఎల్లుండి భారీ వర్షాలు (Rain Alert) సోమవారం, మంగళవారం రెండురోజులు ఆంధ్రప్రదేశ్ కు భారీ నుంచి అతిభారీ వర్షాలు పడనున్నాయి. మంగళవారం వర్ష పాతం గరిష్ఠంగా ఉండనుంది. కొన్నిచోట్ల అతిభారీ వర్షాలు కూడా పడతాయని వాతావరణశాఖ తెలిపింది. దీంతో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికే అధికారులతో సమావేశమై, అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు.

ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి?
అక్టోబరు, నవంబరు నెలల్లో శీతాకాలం ఉండాల్సిన సమయంలో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి.

కొత్తగా ఏర్పడిన వాయుగుండం ఎక్కడ ఉంది?
ఆగ్నేయ బంగాళాఖాతంలో కొత్తగా తీవ్ర వాయుగుండం ఏర్పడింది

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

    Rajitha

    రచయిత గురించి

    Rajitha

    గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.