love marriage tragedy : పుత్తూరు విషాదం, ప్రేమ వివాహం చివరికి ఏం చేసింది?

Read Time:  1 min
love marriage tragedy
love marriage tragedy
FONT SIZE
GET APP

love marriage tragedy : తిరుపతి జిల్లా పుత్తూరులో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. భర్త నిరుద్యోగం, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలతో తీవ్ర మానసిక వేదనకు గురైన ఓ తల్లి తన ఇద్దరు చిన్నారులను ఉరివేసి, అనంతరం తానూ ఆత్మహత్యకు పాల్పడింది. శనివారం పుత్తూరులోని కృష్ణానగర్‌లో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, పద్మ (28) అనే మహిళ తన కుమార్తెలు తేజ శ్రీ (6), లాస్య (5)లను ఉరి వేసి హత్య చేసి, ఆపై తానూ బలవన్మరణానికి పాల్పడింది. సాయంత్రం ఇంటికి వచ్చిన భర్త శివశంకర్ ఈ దృశ్యం చూసి షాక్‌కు గురయ్యాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు.

పద్మ, శివశంకర్ డిగ్రీ చదువుకునే రోజుల్లో ప్రేమించుకుని 2019లో పెద్దలను ఎదిరించి వివాహం చేసుకున్నారు. అయితే, పెళ్లి తర్వాత శివశంకర్ స్థిరమైన ఉద్యోగం చేయకపోవడంతో కుటుంబంలో ఆర్థిక సమస్యలు పెరిగాయి. పిల్లల స్కూల్ ఫీజులు, ఇంటి ఖర్చులు, డ్వాక్రా అప్పులు తీర్చలేక పద్మ తీవ్ర ఒత్తిడికి లోనైనట్లు తెలుస్తోంది.

Read Also: Vijay Sethupathi: రామాయణం సినిమాలో ‘మక్కల్ సెల్వన్’?

love marriage tragedy
love marriage tragedy

మనసును కలిచివేసిన సూసైడ్ నోట్

ఘటనా స్థలంలో లభించిన సూసైడ్ నోట్ అందరినీ కన్నీరు పెట్టించింది.
“తల్లిదండ్రులను ఎదిరించి పెళ్లి చేసుకున్న ప్రతి అమ్మాయికి నా జీవితం ఓ గుణపాఠం. భర్తలో ఉండకూడని లక్షణాలన్నీ నాలోనే కనిపిస్తున్నాయి. నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపానికి నేను మాత్రమే కాదు, నా పిల్లలు కూడా శిక్ష అనుభవిస్తున్నారు” అని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
“నేను చనిపోయాక మరో పెళ్లి చేసుకుంటావు… ఈ సారైనా జీవితంలో స్థిరపడిన తర్వాతే పెళ్లి చేసుకో” అని భర్తను ఉద్దేశించి రాయడం హృదయాలను కలిచివేసింది.

స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకుని భర్త శివశంకర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Sai Kiran

రచయిత గురించి

Sai Kiran

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.