📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు

జగన్ పై పురందేశ్వరి ఘాటు వ్యాఖ్యాలు

Author Icon By Vanipushpa
Updated: February 25, 2025 • 5:58 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

వైసీపీ అధినేత జగన్, ఆ పార్టీ ఎమ్మెల్యేలు నిన్న అసెంబ్లీకి వచ్చి వెంటనే వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. దీనిపై బీజేపీ ఏపీ అధ్యక్షురాలు, ఎంపీ పురందేశ్వరి స్పందిస్తూ జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే సభ్యత్వం రద్దు అవుతుందనే… జగన్ నిన్న అసెంబ్లీకి వెళ్లి అటెండెన్స్ వేయించుకున్నారని ఎద్దేవా చేశారు.
హాజరు కోసం అసెంబ్లీకి..
జగన్ అసెంబ్లీకి వెళ్లి ప్రజా సమస్యలపై మాట్లాడాలని పురందేశ్వరి చెప్పారు. ప్రజా సమస్యలపై మాట్లాడకుండా… హాజరు కోసం అసెంబ్లీకి వెళ్లారని విమర్శించారు. ప్రజలు ఇచ్చిన బాధ్యతలను మర్చిపోరాదని అన్నారు. కేవలం 11 మంది ఎమ్మెల్యేలు ఉన్న పార్టీకి ప్రతిపక్ష హోదా ఎలా వస్తుందని ప్రశ్నించారు. నిర్దిష్టమైన సంఖ్య ఉంటేనే ప్రతిపక్ష హోదా వస్తుందని చెప్పారు. వైసీపీ హయాంలో గౌరవ సభను కౌరవ సభగా మార్చారని దుయ్యబట్టారు.

జగన్ పై పురందేశ్వరి


బడ్జెట్ లో మహిళలు, రైతులకు ప్రాధాన్యత
రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆలోచనా విధానాలకు అనుగుణంగానే కేంద్ర బడ్జెట్ ను రూపొందించారని పురందేశ్వరి చెప్పారు. అంబేద్కర్ ను కాంగ్రెస్ నేతలు అవమానించారని విమర్శించారు. యువత, మహిళలు, రైతులకు బడ్జెట్ లో ప్రాధాన్యతను ఇచ్చారని తెలిపారు. మహిళలు డ్రోన్ల ద్వారా వ్యవసాయం చేసే కార్యక్రమానికి బడ్జెట్ లో ప్రాధాన్యతను కల్పించారని చెప్పారు. రాబోయే ఐదేళ్లలో దేశంలో పేదలకు 3 కోట్ల ఇళ్లను నిర్మిస్తామని పురందేశ్వరి తెలిపారు. రాజమండ్రి ఈఎస్ఐ ఆసుపత్రి నూతన భవనాలను ప్రారంభించి… శస్త్ర చికిత్సలు జరిగేలా కృషి చేస్తామని చెప్పారు. తిరుపతి, రాజమండ్రి, విశాఖ, నెల్లూరు రైల్వే స్టేషన్ల అభివృద్ధికి కేంద్ర కృషి చేస్తోందని తెలిపారు.

పురందేశ్వరి విమర్శలు
పురందేశ్వరి జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే సభ్యత్వం రద్దు అయ్యే ప్రమాదం ఉందని, అసెంబ్లీకి వెళ్లి హాజరు పూర్తి చేసిన ఆయన ఏం చేసినట్లు దూషించారు. ప్రజా సమస్యలపై మాట్లాడకుండా కేవలం హాజరుకు మాత్రమే వెళ్లడం సరైనది కాదని చెప్పారు.

ప్రతిపక్ష హోదా
వైసీపీకి 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్న నేపథ్యంలో, ప్రతిపక్ష హోదా ఎలా రావాలో ప్రశ్నించారు. నియమాల ప్రకారం, నిర్దిష్ట సభ్యుల సంఖ్య తప్పితే ప్రతిపక్ష హోదా రాదు అని తెలిపారు. వైసీపీ హయాంలో గౌరవ సభను కౌరవ సభగా మార్చారు అని ఆమె విమర్శించారు.

#telugu News Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu harsh comments Latest News in Telugu Paper Telugu News Purandeshwari's Telugu News online Telugu News Paper Telugu News Today Today news YS Jagan Mohan Reddy

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.