Pulivendula News: నాసిరక విత్తనాలు… పంట శూన్యం

Read Time:  1 min
Pulivendula News
Pulivendula News
FONT SIZE
GET APP

Pulivendula News : కోటి ఆశలతో సాగుచేసిన కందిపంటపై ఆశలు పెట్టుకున్న రైతున్నకు నాసిరక విత్తనాలు శాపంగా మారాయి. పులివెందుల పట్టణంలోని శ్రీ బాలాజీ రైతు డిపోలో కొనుగోలు చేసిన లేపాక్షి కంపెనీకి చెందిన కంది విత్తనాలతో పంట సాగు చేసిన రైతుకు పంట రాబడి వచ్చే సమయానికి పంట దెబ్బతిని రాబడి శూన్యంగా మారిన సంఘటన పులివెందుల నియోజక వర్గంలోనీ సింహాద్రి పురం మండలం రావుల కొలను గ్రామంలో చోటు చేసుకుంది.

Read Also: Makara Sankranti: సంక్రాంతికి సిద్ధమైన తెలుగు రాష్ట్రాలు..

రావుల కొలను గ్రామంలో కదిరి రవిశంకర్ రెడ్డి అనే రైతు పులివెందుల పట్టణంలోని శ్రీ బాలాజి రైతు డిపో నందు 20 బ్యాగులను ఒక్కొకటి 280 రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసి తనకు ఉన్న నాలుగు ఎకరాలలో సాగు చేశాడు. ఒక వైపు పంట పూర్తిగా మొలకెత్తకపోవడం మరో ప్రక్క మొలకెత్తిన పంట(Poor Quality Seeds) సరిఅయిన పెరుగుదల లేకపోవడం పెరిగిన మొక్కలు కూడా రాబడి వచ్చే సమయం లో ఎండిపోవడంతో రైతు లబోదిబో అంటున్నాడు. ఈ విషయాన్ని వ్యవసాయ అధికారులకు ఫిర్యాదు చేయగా, వారు పొలాన్ని పరిశీలించి వెళ్లినప్పటికీ పది రోజులు గడిచినా ఇప్పటివరకు ఎలాంటి నివేదిక గానీ, చర్యల గానీ లేకపోవడం అధికారుల నిరక్ష్యాన్ని తేటతెల్లం చేస్తోందని రైతు వాపోయారు.

Pulivendula News: Substandard seeds… zero harvest

నాసిరక విత్తనాల కారణంగానే వంట రాబడి రాలేదని స్పష్టంగా తెలుస్తున్నప్పటికీ, బాలాజీ రైతు డిపో యజమాని నుంచి గానీ, లేపాక్షి కంపెనీ నుంచి గానీ ఇప్పటివరకు స్పందన లేకపోవడం అన్యాయమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు జీవనాధారం అయిన వంటతో ప్రయోగాలు చేస్తూ, నాసిరక విత్తనాలను మార్కెట్ లోకి వదిలిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధిత రైతుకు తక్షణమే నష్టపరిహారం చెల్లించి న్యాయం చేయాలని రైతు
కదిరి రవిశంకర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ ఘటనతో రైతుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న విత్తన కంపెనీలు, నిరక్ష వ్యవహరిస్తున్న వ్యవసాయ శాఖ తీరుపై తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మధ్యకాలంలో వివిధ కంపెనీలు పుట్టగొడుగు లా పుట్టుకొస్తున్నాయి. కమీషన్ ల కోసం ఎరువుల దుకాణదా రులు విత్తన కొనుగోలు లోకి వచ్చిన రైతులకు మాయ మాటలు చెప్పి అమ్ముతున్నారు. పంట రాబడి రాలేదని రైతులు వచ్చి దుకాణం వద్ద మొరపెట్టుకున్న విత్తనాలు మంచి కంపెనీవే ఇచ్చాము తెగుళ్లు వచ్చాయి మేమేమి చేయాలంటూ మీరు సరైన సమయంలో మందులు పిచికారి చేయలేదని మీ భూమి లో పోషకాలు తక్కువయాయని తగిన పోషకాలు ఉండేలా మీరు చూసుకోవాలని రైతుల పైనే నెపాన్ని మోపుతున్నారు. ఇలా ఎరువుల దుకాణదారులు మరియు పుట్టగొడుగులా పుట్టుకొస్తున్న నకిలీ కంపెనీలు సరైన నాణ్యమైన విత్తనాలు పంపిణీ చేయకుండా నాసిరక విత్తనాలు పంపిణీ చేసి జేబులు నింపుకుంతున్నారని అన్నారు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Tejaswini Y

రచయిత గురించి

Tejaswini Y

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.