📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Andhra Pradesh: తెరపైకి పుంగనూరును అన్నమయ్య జిల్లాలో కలపాలని ప్రతిపాదన

Author Icon By Anusha
Updated: May 17, 2025 • 12:32 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఏపీలో గత ప్రభుత్వం హయాంలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. 13 ఉమ్మడి జిల్లాలను 26 జిల్లాలుగా పునర్విభజన చేశారు. అయితే ఇప్పటికీ కొన్ని జిల్లాల్లోని మండలాలు, రెవెన్యూ డివిజన్ల మార్పు అంశంపై ప్రభుత్వానికి వినతులు వస్తున్నాయి. అలాగే ఒకటి, రెండు కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ కూడా వినిపించింది. అయితే తాజాగా ప్రభుత్వం దగ్గరకు ఒక సరికొత్త ప్రతిపాదన వచ్చినట్లు తెలుస్తోంది. ఓ మాజీ మంత్రి నియోజకవర్గాన్ని మరో జిల్లాలో కలపాలనే ఆలోచన జరుగుతోంది అంటున్నారు. ఈ మేరకు ప్రభుత్వం దగ్గరకు ప్రతిపాదనలు వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది.ప్రస్తుతం చిత్తూరు జిల్లా(Chittoor District)లో ఉన్న పుంగనూరు నియోజకవర్గాన్ని తీసుకెళ్లి అన్నమయ్య జిల్లాలో కలపాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రజలకు సౌకర్యంగా ఉండాలని ఈ నిర్ణయం తీసుకునే దిశగా ఆలోచన చేస్తున్నారని 2022లో జిల్లాల విభజన సమయంలోనే ఇది జరగాల్సి ఉన్నా అప్పటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒత్తిడితో అది జరగలేదనే వాదన వినిపిస్తోంది. ఈ క్రమంలో ఇప్పుడు మళ్లీ పుంగనూరు నియోజకవర్గాన్ని(Punganur constituency) అన్నమయ్య జిల్లాలో కలపాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఈ మేరకు పుంగనూరు నియోజకవర్గాన్ని అన్నమయ్య జిల్లాలో కలపడానికి అధికారులు ప్రభుత్వానికి సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. ప్రజల సౌలభ్యం కోసమే ఈ మార్పు చేస్తున్నారని దీనిపై ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందని సమాచారం.

Andhra Pradesh: తెరపైకి పుంగనూరును అన్నమయ్య జిల్లాలో కలపాలని ప్రతిపాదన

డివిజన్‌

వాస్తవానికి పార్లమెంట్ నియోజకవర్గాల ప్రకారం జిల్లాలను ఏర్పాటు చేశారు.రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గం(Rajampet Parliament Constituency)లోని పుంగనూరును చిత్తూరులో కలపడంపై మాత్రం అభ్యంతరం వ్యక్తమైంది. మదనపల్లె రెవెన్యూ డివిజన్‌కు దగ్గరగా పుంగనూరు, చౌడేపల్లి, సోమల, సదుం, రొంపిచెర్ల మండలాలు ఉన్నాయి. వీటిని పలమనేరు డివిజన్‌లో చేర్చారు. రెవెన్యూ డివిజన్ కేంద్రానికి వెళ్లడానికి ప్రజలకు ఇబ్బందిగా ఉందని ప్రభుత్వం గుర్తించింది. అందుకే అన్నమయ్య జిల్లాలో కలిపేలా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ నియోజకవర్గంలోని పులిచెర్ల మండలం(Pulicherla Mandalam) మాత్రం చిత్తూరు జిల్లాలోనే ఉంటుంది.మదనపల్లె రెవెన్యూ డివిజన్‌లో ఇప్పటికే 11 మండలాలు ఉన్నాయి. కొత్తగా మరో ఐదు మండలాలు చేరే అవకాశం ఉంది. ప్రజల సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మార్పును ఉన్నతాధికారులు ప్రతిపాదించినట్లు చెబుతున్నారు. దీనిపై పూర్తిగా క్లారిటీ రావాల్సి ఉంది.

Read Also: Senior citizens: సీనియర్ సిటిజన్ల కోసం ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

#AndhraPradesh #annamayyadistrict #DistrictReorganization #Punganur Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.