📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Prisoners AP: ఏపీలో సత్ప్రవర్తన కలిగిన ఖైదీల విడుదల చేయనున్న ప్రభుత్వం

Author Icon By Anusha
Updated: June 19, 2025 • 3:20 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి మానవతా దృక్పథాన్ని ప్రదర్శించింది. జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న మంచి ప్రవర్తన కలిగిన 17 మంది ఖైదీలను విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర హోంశాఖ ప్రతిపాదనలను మంత్రి వర్గం ఆమోదించింది. సుప్రీంకోర్టు సూచించిన మార్గదర్శకాలను అనుసరిస్తూ, ఖైదీల శిక్షలో భాగంగా వారి ప్రవర్తన, ఒప్పంద నిబద్ధతను జైళ్ల శాఖ సవివరంగా పరిశీలించింది.ఈ 17 మంది ఖైదీలు2025 ఫిబ్రవరి 1 వరకు శిక్ష అనుభవించాల్సిన ఖైదీ (Prisoners) లను విడుదల చేస్తున్నారు. విడుదలైన ఖైదీలు కొన్ని షరతులు పాటించాల్సి ఉంటుంది. ఖైదీలు విడుదల సమయంలో రూ.50 వేల వ్యక్తిగత బాండ్ సమర్పించాలి.ఈ ఖైదీలు జైలు నుంచి విడుదలైన తర్వాత, వారు పోలీస్ స్టేషన్‌లో హాజరు కావాల్సి ఉంటుంది.

మంచి ప్రవర్తన

అలాగే ప్రతి మూడు నెలలకు ఒకసారి ప్రొబేషన్ అధికారి (Probation Officer) ముందు హాజరు కావాల్సి ఉంటుంది. విడుదలైన ఖైదీలు మళ్లీ నేరం చేస్తే, వారిని తిరిగి అరెస్టు చేస్తారని ప్రభుత్వం తెలిపింది. మంచి ప్రవర్తన కలిగిన ఖైదీలకు ఇది ఒక అవకాశం,వారు తమ జీవితాలను మార్చుకోవడానికి ఉపయోగంగా ఉంటుందని ప్రభుత్వం చెబుతోంది. సత్ప్రవర్తన కలిగిన ఖైదీల జాబితాను సిద్ధం చేయాలని జైళ్ల శాఖ డీజీ (DG of Prisons Department) ని ఆదేశించింది. అర్హులైన ఖైదీలను ఏటా ఫిబ్రవరి, జూన్, అక్టోబరు 1వ తేదీల్లో విడుదల చేస్తారు.ముందుస్తు విడుదల కోసం హోంశాఖ ముఖ్య కార్యదర్శి ఛైర్మన్‌గా ఒక కమిటీని ఏర్పాటు చేశారు. 

Prisoner Ap

విడుదలైన ఖైదీలు

వీరిలో న్యాయశాఖ కార్యదర్శి, డీజీపీ, నిఘా విభాగాధిపతి, జైళ్ల శాఖ డీజీ, సీఐడీ ప్రధాన న్యాయ సలహాదారు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు.ఈ కమిటీ ఖైదీల వివరాలను పరిశీలిస్తుంది. అర్హత లేని వారిని తిరస్కరిస్తుంది. సత్ప్రవర్తన (Good behavior) తో ముందుస్తు విడుదలకు అర్హత పొందిన ఖైదీలు వ్యక్తిగతంగా రూ.50 వేలకు పూచీకత్తు సమర్పించాల్సి ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. జైలు నంచి విడుదలైన ఖైదీలు మంచిగా ప్రవర్తిస్తామని హామీ ఇవ్వాలి. విడుదల తర్వాత వారు ఏదైనా నేరం చేస్తే, వారి క్షమాభిక్ష రద్దవుతుందనే నిబంధణల్ని విధించింది ప్రభుత్వం.

Read Also: Nara Lokesh: బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌తో లోకేశ్‌ భేటీ..ఏఐ టూల్స్ వినియోగంపై చర్చ

#AndhraPradesh #APGovernment #GoodConduct #PrisonReform Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.