हिन्दी | Epaper
స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

పోసానికి 14 రోజుల రిమాండ్ జైలు కు తరలింపు.

Anusha
పోసానికి 14 రోజుల రిమాండ్ జైలు కు తరలింపు.

సినీ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళిని అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. జనసేన రాయలసీమ జోన్ కన్వీనర్ జోగిమణి ఫిర్యాదు మేరకు ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోసాని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఆయన కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈ అరెస్ట్ జరిగింది.

14 రోజుల రిమాండ్

సినీ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళికి రైల్వే కోడూరు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, పోలీసులు కొద్దిసేపటి క్రితమే ఆయన్ని రాజంపేట సబ్‌జైలుకు తరలించారు. అలాగే, ఆయనను కస్టడీకి కోరుతూ ఈ రోజు పోలీసులు పిటిషన్ దాఖలు చేసే అవకాశముంది.

సంచలన విషయాలు

పోసాని కృష్ణమురళిపై పోలీసులు దాఖలు చేసిన రిమాండ్ రిపోర్టులో అనేక కీలక అంశాలు వెల్లడయ్యాయి. ఆయన తన వ్యాఖ్యల ద్వారా కులాల మధ్య చిచ్చు పెట్టారని, ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు ఆయన కుటుంబంపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని పోలీసులు పేర్కొన్నారు.

సినీ పరిశ్రమకు ఓ ప్రత్యేక కులాన్ని ఆపాదించారని,

నంది అవార్డుల కమిటీపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారని,

నారా లోకేశ్‌ను దూషించారని పేర్కొన్నారు.

ఇంతేకాకుండా, పోసాని కృష్ణమురళిపై రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 14 కేసులు నమోదైనట్లు రిమాండ్ రిపోర్టులో అధికారులు తెలిపారు.

1692689 posani

బుధవారం, ఏపీ పోలీసులు పోసాని కృష్ణమురళిని హైదరాబాద్‌లో అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అనంతరం గురువారం అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్‌స్టేషన్‌లో జిల్లా ఎస్పీ విద్యాసాగర్ ఆధ్వర్యంలో సుమారు 9 గంటల పాటు విచారించారు.దీని తర్వాత, రాత్రి 9.30 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కోర్టులో విచారణ జరిగింది. వాదనలు కొనసాగిన అనంతరం రైల్వే కోడూరు కోర్టు పోసానికి 14 రోజుల రిమాండ్ విధిస్తూ తీర్పు ఇచ్చింది. దీంతో ఆయన మార్చి 13 వరకు రిమాండ్‌లో ఉండనున్నారు.పోలీసులు మరింత సమాచారం సేకరించి, కేసుపై తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఈ కేసుపై మరిన్ని పరిణామాలు త్వరలో వెలుగు చూడనున్నాయి.మరోవైపు కోర్టులో వాదనల సందర్భంగా జడ్జి ముందు పోసాని వాస్తవాలను అంగీకరించారు. తన భార్యను దూషించారని.అందుకే ఆ బాధతో తాను అలా మాట్లాడాల్సి వచ్చిందని తెలిపారు. తాను మాట్లాడిన మాటలు నిజమేనని అంగీకరించారు. తన భార్యను దూషించిన దూషణలను కట్ చేసి… బాధతో తాను మాట్లాడిన మాటలను మాత్రమే చూపించారని ఆవేదన వ్యక్తం చేశారు. తన భార్యను దూషించిన వీడియోలను సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ల నుంచి తొలగించారని పోసాని పేర్కొన్నారు.

రాజంపేట సబ్‌జైలు

పోసాని కృష్ణమురళికి రైల్వే కోడూరు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.ఈ నేపథ్యంలో, పోలీసులు కొద్దిసేపటి క్రితమే ఆయన్ని రాజంపేట సబ్‌జైలుకు తరలించారు. అలాగే, ఆయనను కస్టడీకి కోరుతూ ఈ రోజు పోలీసులు పిటిషన్ దాఖలు చేసే అవకాశముంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870