📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Andhra Pradseh: పోలీసులు తప్పు చేస్తే కోర్టుధిక్కరణ కేసు నమోదు చేస్తాం:హైకోర్టు

Author Icon By Anusha
Updated: May 21, 2025 • 10:56 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రాజకీయ పార్టీల తీరుపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టును ఆటస్థలంగా మార్చడానికి వీల్లేదని వ్యాఖ్యానించింది. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నగర పంచాయతీ ఛైర్మన్ ఎన్నికలో ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేలా పోలీసు భద్రత కల్పించాలని వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ వై.లక్ష్మణరావు విచారణ జరిపారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నగర పంచాయతీ ఛైర్మన్ ఎన్నికలో వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్ల
(YSRCP councilors)కు పోలీసు భద్రత కల్పించాలని విజయవాడ పోలీసు కమిషనర్‌ను ఆదేశించింది. ఇలాంటి చిన్న విషయాలకు కూడా కోర్టును ఆశ్రయిస్తున్నారని ఇది కోర్టు స్థాయిని తగ్గిస్తోందని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ నెల 29న పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. పోలీసులు తప్పు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.భద్రత కోసం పిటిషనర్లు సమర్పించిన వినతిని రాష్ట్ర ఎన్నికల సంఘం(State Election Commission) పోలీసులకు పంపిందని హైకోర్టు న్యాయమూర్తి గుర్తు చేశారు. ఎస్‌ఈసీ ఆదేశించినా పోలీసులు పట్టించుకోలేదా అని ప్రశ్నించారు. పోలీసులు తప్పు చేస్తే సుమోటో కోర్టుధిక్కరణ కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఒకవేళ పిటిషనర్లు పోలీసు భద్రత ముసుగులో అక్రమాలకు పాల్పడితే రూ.10 లక్షల జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ప్రస్తుత వ్యాజ్యం విషయంలో పోలీసులు తప్పు చేశారని తేలితే డీజీపీ స్థాయి నుంచి కానిస్టేబుల్‌ వరకు శిక్షిస్తామని కోర్టు తేల్చి చెప్పింది.

Andhra Pradseh: పోలీసులు తప్పు చేస్తే కోర్టుధిక్కరణ కేసు నమోదు చేస్తాం:హైకోర్టు

కౌన్సిలర్లు

గత కొన్నేళ్లుగా రాజకీయ పార్టీలు ప్రతి చిన్న విషయానికి హైకోర్టును ఆశ్రయిస్తున్నాయని వ్యాఖ్యానించింది. గత ఐదారేళ్లుగా ప్రతి చిన్న విషయానికి రాజకీయ పార్టీలు హైకోర్టును క్రీడామైదానంలా వాడుకుంటున్నాయని తీవ్రంగా స్పందించింది. చిన్న సమస్యలను కూడా కోర్టు వెలుపల పరిష్కరించుకోలేకపోతున్నారని ప్రశ్నించింది. ఇలాంటి కారణాలతో కోర్టును ఆశ్రయించడం వల్ల హైకోర్టు స్థాయి తగ్గిపోతోందని అభిప్రాయపడింది. హైకోర్టు స్థాయిని రెండో తరగతి మేజిస్ట్రేట్‌ కోర్టు స్థాయికి తగ్గించేశారని ఘాటుగా వ్యాఖ్యానించింది. హైకోర్టు చేసిన ఈ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.వైఎస్సార్‌సీపీ ఛైర్మన్ అభ్యర్థి ఓటింగ్‌లో పాల్గొనకుండా సీఐ, డీఎస్పీ అడ్డుకున్నారని పిటిషనర్ల తరఫు లాయర్ కోర్టుకు తెలిపారు. శాంతిభద్రతల సమస్య తలెత్తడంతో కౌన్సిలర్లు ఒక హోటల్‌లో ఉన్నారని చెప్పారు. వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు ఎక్కడ ఉన్నారో పోలీసులకు తెలియదని పోలీసుల తరఫున ప్రభుత్వ లాయర్ వాదనలు వినిపించారు. వారు స్టేషన్‌లో వినతి పత్రం అందజేస్తే వారికి భద్రత కల్పించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. అలాగే పోలీసుల ఆత్మస్ధైర్యాన్ని దెబ్బతీసేలా నిరాధార ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఒకవేళ పోలీసులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తుంటే ఎందుకు ఫిర్యాదు చేయలేదన్నారు.

Read Also: Five star hotels: ఆంధ్రా లో నూతనంగా ఫైవ్ స్టార్ హోటల్స్‌కి ఆమోదం

#AndhraPradeshHighCourt #ElectionSecurity #PoliceAccountability #SECOrders Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.