📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Plot Allotment: ఏపీలో ప్లాట్ల కేటాయింపునకు కొత్త మార్గదర్శకాలు

Author Icon By Anusha
Updated: May 31, 2025 • 2:21 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఏపీప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఎన్టీఆర్ ఎంఐజీ స్మార్ట్ టౌన్‌షిప్‌లలో ప్లాట్ల కేటాయింపునకు సంబంధించి కొత్త మార్గదర్శకాలు జారీ చేయనుంది. ఈ ఆర్థిక స్థోమత ఉన్న ఎవరైనా వేలంలో పాల్గొనవచ్చు, గత ప్రభుత్వం ప్రారంభించిన వైఎస్సార్‌ ఎంఐజీ టౌన్‌షిప్‌(MIG Township)లను కూటమి ప్రభుత్వం ఎన్టీఆర్‌ స్మార్ట్‌ టౌన్‌షిప్‌లుగా మార్చింది. ఈ మేరకు ప్లాట్ల కేటాయింపులో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి ఈ నిర్ణయం తీసుకుంది.ఈమేరకు త్వరలో కొత్త మార్గదర్శకాలు విడుదల చేయనుంది ప్రభుత్వం.గత ప్రభుత్వం మధ్య తరగతి ప్రజల కోసం 36 వైఎస్సార్‌ ఎంఐజీ స్మార్ట్‌ టౌన్‌షిప్‌లను ప్రారంభించిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల ఈ ప్రాజెక్టులు ఆగిపోయాయి. అయితే కొన్ని టౌన్‌షిప్‌లలో లాటరీ ద్వారా ప్లాట్లు కేటాయించారు.కానీ వాటి రిజిస్ట్రేషన్లు మాత్రం జరగలేదు. దీంతో ప్లాట్లు అలాగే ఉండిపోయాయి. ఈ టౌన్‌షిప్‌లలో ప్లాట్లను వేలం వేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వీటికి ఎన్టీఆర్‌ స్మార్ట్‌ టౌన్‌షిప్‌(NTR Smart Township)లుగా పేరు మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే సీనియర్ అధికారులతో కమిటీ కూడా ఏర్పాటు చేసి వారి సూచనల ప్రకారం కొత్త మార్గదర్శకాలు రూపొందిస్తున్నారన్నారు.

కొనుగోలు

లాటరీ ద్వారా ఏ ప్లాట్‌ వస్తుందో తెలియదు,ఒకవేళ లాటరీలో వచ్చిన తర్వాత వాస్తు ప్రకారం ప్లాట్‌ లేదని చాలామంది తీసుకోవడానికి ఇష్టపడరనే వాదన వినిపిస్తోంది. అందుకే గతంలో కొనుగోలు చేసిన వాటికి కూడా వాయిదాల చెల్లింపులు ఆగాయంటున్నారు. ఈ క్రమంలో ప్లాట్ల నంబర్ల వారీగా వేలం నిర్వహించాలని ప్రభుత్వం ఆలోచనగా చెబుతున్నారు.ఇలా చేస్తే ప్రజలు ముందుగా ప్లాట్లను చూసి తమకు నచ్చిన వాటిని వేలంలో కొనుగోలు చేసే అవకాశం ఉంది అంటున్నారు. గతంలో వార్షికాదాయం(Annual income) రూ.18 లక్షలు ఉన్నవారికే అవకాశం ఉండేది. ఈ క్రమంలోచాలా మందికి ఛాన్స్ దక్కలేదు ఇప్పుడు ఆ నిబంధనను తొలగించాలని చూస్తున్నారు.

Plot Allotment: ఏపీలో ప్లాట్ల కేటాయింపునకు కొత్త మార్గదర్శకాలు

కొనుగోలు

ప్రభుత్వం ఆర్థిక స్థోమత ఉంటే చాలు ఎవరైనా వేలంలో పాల్గొనేలా అవకాశం ఇవ్వాలని భావిస్తోందట. ఈ వేలంలో పాల్గొనేవారు ముందుగా విలువలో 10% చెల్లించాలని,వేలం ద్వారా ప్లాట్ల కేటాయిస్తే కనుక రూ.2-4 వేల కోట్ల ఆదాయం వస్తుందని ఒక అంచనా ఉంది. ఈ డబ్బుతో టౌన్‌షిప్‌లలో మౌలిక సదుపాయాలు కల్పిస్తే కొనుగోలు చేసిన వారికి కూడా నమ్మకం కలుగుతుంది అంటున్నారు. మరి ఈ ప్లాట్లకు ప్రజల నుంచి ఏ మేరకు స్పందన వస్తుందన్నది చూడాలి. త్వరలోనే మార్గదర్శకాలు విడుదల చేసి ఈ వేలం ప్రక్రియ నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది.

Read Also: TTD: టీటీడీ భద్రతపై ఉన్నతస్థాయి సమావేశం

#AndhraPradesh #apgovt #MIGPlots #NTRSmartTownships Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.