📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Security: జగన్ జడ్ ప్లస్ సెక్యూరిటీ కోసం హైకోర్టు లో పిటీషన్

Author Icon By Anusha
Updated: May 10, 2025 • 1:45 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌‌మోహన్ రెడ్డికి జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత కల్పించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. తనకు సీఆర్‌పీఎఫ్ లేదా ఎన్‌ఎస్‌జీతో భద్రత కల్పించాలని జగన్ పిటిషన్‌లో కోరారు. తనకు జెడ్‌ప్లస్‌ భద్రత పునరుద్ధరించేలా, ఎన్‌ఎస్‌జీ లేదా సీఆర్‌పీఎఫ్‌ సిబ్బందితో సెక్యూరిటీ కల్పించాలన్న వినతిని పరిగణనలోకి తీసుకొనేలా కేంద్ర హోంశాఖను ఆదేశించాలని కోరారు. ఈ మేరకు హైకోర్టులో విచారణ జరగ్గా జగన్‌కు(YS Jagan) తగిన భద్రత కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని పిటిషనర్ తరఫున లాయర్ వై నాగిరెడ్డి వాదనలు వినిపించారు. ఇటీవల ఘటనలు చూస్తే పిటిషనర్‌ భద్రత, స్వేచ్ఛ ప్రమాదంలో ఉందని.అందుకే కేంద్ర హోంశాఖకు వినతులు సమర్పించామన్నారు. భద్రత కుదింపుపై హైకోర్టులో గతంలో ఓ పిటిషన్ దాఖలు చేశామన్నారు.

వివరాలు

హైకోర్టు కు పూర్తి వివరాలు అందించడానికి కొంత సమయం కావాలని కేంద్ర ప్రభుత్వం తరఫున డిప్యూటీ సొలిసిటర్ జనరల్ (డీఎస్‌జీ) పసల పొన్నారావు(Pasala Ponna Rao) కోరారు. భద్రత విషయంలో జగన్ గతంలోనే వ్యాజ్యం వేశారని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ గుర్తు చేశారు. ఆ వ్యాజ్యంలో కేంద్రాన్ని ప్రభుత్వాన్ని ప్రతివాదిగా పేర్కొన్నారని,ఆ వ్యాజ్యం ఇంకా పెండింగ్‌లో ఉందని కోర్టుకు తెలిపారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయమూర్తి,కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ప్రతివాదులను ఆదేశించింది. కేంద్ర హోంశాఖ కార్యదర్శి, ఐబీ డైరెక్టర్, సీఆర్‌పీఎఫ్ డీజీ, ఎన్‌ఎస్‌జీ డీజీ, రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శికి కోర్టు నోటీసులు(Notice) జారీ చేసింది. వేసవి సెలవుల తర్వాత ఈ కేసును విచారిస్తామని న్యాయమూర్తి జస్టిస్ ఎస్ సుబ్బారెడ్డి తెలిపారు. విచారణను వేసవి సెలవుల తర్వాతకు వాయిదా వేశారు.

Security: జగన్ జడ్ ప్లస్ సెక్యూరిటీ కోసం హైకోర్టు లో పిటీషన్

వినతిపత్రం

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ జగన్‌ భద్రత విషయంలో నిర్లక్ష్యం(Neglegency) కనిపిస్తోందని వైఎస్సార్‌సీపీ ఆరోపిస్తోంది. గతంలో గవర్నర్‌ను కలిసి వినతిపత్రం అందించారు.అలాగే సెక్యూరిటీ విషయంలో లోపాలు ఉన్నాయంటూ హైకోర్టును ఆశ్రయించారు. అయితే ప్రభుత్వం మాత్రం జగన్‌కు చట్ట ప్రకారం కల్పించాల్సిన భద్రతను కొనసాగిస్తున్నట్లు చెబుతోంది. హైకోర్టు ఈ పిటిషన్‌పై ఎలా స్పందిస్తుందన్నది చూడాలి.

Read Also: Andhra Pradesh: ఏపీలో మరో ప్రధాన రోడ్డు విస్తరణ ఎక్కడంటే?

#CRPF #highcourt #NSGSecurity #SecurityPlea #YSJagan #ZPlusSecurity Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.