📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Peddireddy: పెద్దిరెడ్డి భూ ఆక్రమణలపై తాజాగా విచారణ

Author Icon By Ramya
Updated: July 5, 2025 • 10:35 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దేవాదాయ అధికారులకు హైకోర్టు ఆదేశం

Vijayawada: బుగ్గ మఠానికి చెందిన 3.88 ఎకరాల భూమిని ఆక్రమించిన వ్యవహారంలో మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి (Peddireddy) రామచంద్రారెడ్డి పై తాజాగా విచారణ జరపాలని దేవాదాయశాఖ అధికారులను హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. బుగ్గమఠానికి చెందిన 3.88 ఎకరా భూమిని ఖాళీ చేయాలని, అందులో నిర్మాణాలను తొలగించాలంటూ మఠం ఈవో/అసిస్టెంట్ కమిషనర్ ఇచ్చిన ఉత్తర్వులపై అభ్యంతరం ఉంటే దేవాదాయ ట్రైబ్యునల్ను ఆశ్రయించాలని ఇటీవల హైకోర్టు సింగిల్ జడ్జి గతంలో ఉత్తర్వులిచ్చారు. ఈ ఉత్తర్వులను సవాలుచేస్తూ పెద్దిరెడ్డి (Peddireddy) ధర్మా సనం ముందు అప్పీల్ వేశారు. ఆయన తరఫున సీనియర్ న్యాయవాది సీవీ మోహన్రెడ్డి వాద నలు వినిపించారు. తమ వాదనలు వినకుండా, కోరిన దస్త్రాలు ఇవ్వకుండా మఠం ఈవో ఉత్తర్వులిచ్చారన్నారు. వాటిని రద్దు చేయాలని కోరారు. రాష్ట్రప్రభుత్వం, మఠం తరఫున ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ (Dammalapati Srinivas) వాదనలు వినిపించారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Peddireddy Ramachandra Reddy) మఠం భూములను ఆక్రమించారన్నారు. 3.88 ఎకరాల విషయంలో ఆయన వద్ద ఎలాంటి దస్త్రాలు లేవన్నారు. మఠం వద్ద ఉన్న దస్త్రాలను మీరే ఇవ్వండి అంటూ వ్యవహారాన్ని సంక్లిష్టం చేస్తున్నారన్నారు.

Peddireddy: పెద్దిరెడ్డి భూ ఆక్రమణలపై తాజాగా విచారణ

అధికారులపై ఆరోపణలు నిరాధారమన్న వాదనలు

అధికారులపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారన్నారు. దస్త్రాలు ఇచ్చేందుకు అభ్యంతరం లేదన్నారు. తిరుపతి పట్టణం, ఎంఆర్ పల్లి పరిధి సర్వే నంబరు 261/1లో 1.50 ఎకరాలు, 261/2లో 2.38 ఎకరాల(మొత్తం 3.88)కు సంబంధించిన దస్త్రాలను వారం రోజుల్లో పెద్దిరెడ్డికి ఇవ్వాలని, తర్వాత వివరణ తీసుకోని మొత్తం నాలుగు వారాల్లో విచారణ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులకు స్పష్టం చేసింది. అందుకు ముందు విచారణ జరిపిన మఠం ఈవో/అసిస్టెంట్ కమిషనర్ తో కాకుండా మరో అధికారితో విచారణ జరిపించాలని పెద్దిరెడ్డి తరఫు సీనియర్ న్యాయవాది అభ్యర్థిస్తున్న నేప థ్యంలో మరో అధికారితో విచారణ జరిపించాలని ఆదేశించింది. 3.88 ఎకరాలను ఖాళీచేయా లంటూ మఠం ఈవో ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసింది. తాజాగా విచారణ జరిపాక ప్రతికూల ప్రభావం చూపేలా ఉత్తర్వులుంటే వాటిపై పెద్దిరెడ్డి అప్పీల్ వేసుకోవడానికి వెసులుబాటు ఇచ్చింది. ఆ ఉత్తర్వుల ఆధారంగా మూడు వారాలపాటు చర్యలు తీసుకోవద్దని అధికారులను ఆదేశించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకుర్, జస్టిస్ చీమల పాటి రవితో కూడిన ధర్మాసనం ఈమేరకు ఉత్తర్వులిచ్చింది.

Read hindi news: hindi.vaartha.com

Read also: Tirumala: తిరుపతి లో తొక్కిసలాట ఘటనపై నేడే నివేదిక

#AndhraPradeshPolitics #Buggamatham #DevadayaDepartment #HighCourtOrders #JusticeDheerajSinghThakur #LandEncroachmentCase #PeddireddyLandDispute #TempleLandEncroachment #TirupatiLandRow #YSRCPLegislator 3.88 acres AG Dammalapati Srinivas Andhra Pradesh politics Ap News in Telugu assistant commissioner Breaking News in Telugu Buggamatham land court directive CV Mohan Reddy Devadaya Department EO orders Google News in Telugu High Court orders land documents land encroachment Latest News in Telugu legal hearing Paper Telugu News Peddireddy Ramachandra Reddy survey numbers 261/1 and 261/2 Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Temple Land Dispute temple property Tirupati land case Today news tribunal appeal YSRCP MLA

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.