📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Pawan: ఆన్‌లైన్ బెట్టింగ్‌ కి బలైన ఇంజనీర్

Author Icon By Anusha
Updated: July 7, 2025 • 12:05 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఈజీగా డబ్బు సంపాదించాలనే ఆశ ఆన్‌లైన్‌ గేమ్స్‌, బెట్టింగ్‌ యాప్స్‌.. ఇవి యువత జీవితాల్లో నెమ్మదిగా విషాన్ని కలుపుతున్నాయి. గత కొన్నేళ్లుగా ఈ ట్రెండ్ ప్రమాదకరంగా మారుతోంది. లక్కీ డ్రా, జాక్‌పాట్‌లు, బోనస్‌లు అంటూ ఆకర్షణలు చూపించి ఈ యాప్స్‌ యువతను పట్టిపీడిస్తున్నాయి. అలా ఒక యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ జీవితం అర్థంతరంగా ముగిసింది.హైదరాబాద్‌లోని మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటన తీవ్ర విషాదానికి దారి తీసింది. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన పవన్ (Pawan) అనే యువకుడు బెట్టింగ్ లో డబ్బులు కోల్పోయిన శోకంలో ఆత్మహత్య చేసుకున్నాడు. పవన్ బేగంపేట్ లోని ఓ ప్రైవేట్ ఐటీ సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తూ, ఎల్లారెడ్డిగూడలోని ఓ బాయ్స్ హాస్టల్‌లో తన స్నేహితులతో కలిసి నివసిస్తున్నాడు.

కుటుంబ సభ్యులకు

సోమవారం ఉదయం అనూహ్యంగా బాత్రూంలోకి వెళ్లిన పవన్, ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో స్నేహితులకు అనుమానం వచ్చి చూడగా అప్పటికే చనిపోయి ఉన్నాడు పవన్ సెల్‌ఫోన్‌ పరిశీలించడంతో బెట్టింగ్ యాప్ ల మెసేజ్ లు ఉన్నట్లు గుర్తించారు. ఇటీవలే పవన్‌ తండ్రి అప్పులు చెల్లించాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు మధురానగర్ పోలీసులు. పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు మృతదేహం అప్పగించడంతో పశ్చిమగోదావరి జిల్లాకు తరలించారు. ఆన్‌లైన్‌ గేమ్‌ (Online game) లు కావొచ్చూ బెట్టింగ్‌లు కావొచ్చూ, మొదట్లో చిన్న మొత్తంలో పెట్టి గెలుస్తారు. ఆ తర్వాత మెల్లి మెల్లిగా పొగొట్టుకుంటారు. పోయింది తిరిగి రాబట్టుకోవాలని మళ్లీ మళ్లీ ఆడుతారు. అదో విష వలయం. దానికి అడిక్ట్ అయితే అందులోంచి బయటపడటం అసాధ్యం. ఆ ఊబిలోంచి బయటపడలేకే పవన్‌ లాంటి యువకులు తనువు చాలిస్తున్నారు.

Pawan: ఆన్‌లైన్ బెట్టింగ్‌ కి బలైన ఇంజనీర్

యాప్‌లను బ్యాన్‌

బెట్టింగ్‌లకు అలవాటు పడి చావుని కొనితెచ్చుకోవడం సరికాదంటున్నారు నిపుణులు. తప్పులు ఒప్పుకుని దాన్నుంచి బయటపడాలంటున్నారు. అదే సమయంలో ప్రభుత్వాలు ఆన్‌లైన్‌ గేమింగ్‌, బెట్టింగ్‌ యాప్‌లను బ్యాన్‌ చేయాలంటున్నారు.ఈ ఆన్‌లైన్ బెట్టింగ్‌ (Online betting) వేదికలు నియంత్రించకపోతే మరెన్ని ప్రాణాలు పోతాయో చెప్పలేం. యువతను రక్షించాలంటే అవగాహన పెంచడం, చట్టాలను కఠినతరం చేయడం, టెక్నాలజీని సమర్థవంతంగా వినియోగించుకోవడం అత్యవసరం.

Read hindi news: hindi.vaartha.com

Read Also: TG Police: గంజాయి నిర్మూలనకు పోలీసుల సరికొత్త వ్యూహం

#BettingAddiction #BettingAppAbuse #BettingLoss #BettingTragedy #DigitalAddiction #EasyMoneyTrap #GamblingCrisis #HyderabadNews #MadhuranagarPolice #MentalHealthAwareness #OnlineBetting #OnlineGamingAddiction #OnlineScams #PawanSuicide #SocialAwareness #SoftwareEngineer #SuicideCase #TeluguNews #WestGodavari #YouthSuicide Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.