ఆంధ్రప్రదేశ్ లోని పాపికొండల విహారయాత్రకు బ్రేక్ పడింది. ఒకటి, రెండు రోజులుగా అకాల వర్షాలతో పాటుగా ఈదురుగాలులు(Stormy winds) వీస్తుండటంతో పాపికొండల విహారయాత్రను నిలిపివేశారు.ఈరోజు నుంచి మూడు రోజులపాటు పాపికొండల విహారయాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ విషయాన్ని పర్యాటకులు గమనించాలని పోశమ్మగండి కంట్రోల్ రూం మేనేజర్ సాంబశివరావు(Control Room Manager Sambasiva Rao) తెలిపారు. గత కొద్దిరోజులుగా మన్యం ప్రాంతంతో పాటుగా పోశమ్మగండి పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. ఈ క్రమంలోనే అధికారులు విహారయాత్రను నిలిపివేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు.రెండు రోజులుగా పాపికొండలు విహారయాత్ర(Papikondalu)కు బోట్లు వెళ్తున్నాయి.కానీ తిరిగి వచ్చే సమయానికి వాతావరణం ఒక్కసారిగా మారిపోతోంది. ఈ క్రమంలో అధికారులు పర్యాటకుల భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం కూడా గండిపోశమ్మ ఆలయం(Gandiposhamma Temple) నుంచి రెండు బోట్లలో దాదాపుగా వంద మంది వరకు పర్యాటకులు పాపికొండల అందాలను చూసేందుకు వెళ్లారు. కానీ తిరిగి వచ్చే సమయంలో వాతావరణం మారిపోయింది.పోచవరం నుంచి యాత్ర నిలిపివేశారు. ఈ మేరకు మళ్లీ వాతావరణ పరిస్థితులు అనుకూలించి ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చేవరకు పర్యాటకాన్ని ఆపాలని చింతూరు ఐటీడీఏ పీవో అపూర్వ భరత్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో పాపికొండల విహారయాత్రను నిలిపివేశారు.
తేలికపాటి
వచ్చే రెండు రోజుల్లో రాయలసీమలో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన భారీవర్షాలు, గంటకు50-60కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. హోర్డింగ్స్(Hoardings), చెట్ల క్రింద, శిథిలావస్థలో ఉన్న గోడలు, భవనాలు దగ్గర నిలబడరాదు.ఉష్ణోగ్రతలు38 డిగ్రీల-40 డిగ్రీల మధ్య నమోదుకు అవకాశం ఉంది. ఇవాళ తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, కడప, అన్నమయ్య, శ్రీసత్యసాయి, అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. విజయనగరం, విశాఖ, అనకాపల్లి, ఉభయ గోదావరి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ(Dr. B.R. Ambedkar Konaseema), కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలుకు అవకాశం ఉంది’ అన్నారు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్.
Read Also: Bhuma Akhila Priya : ఆర్మీకి 5 నెలల జీతం విరాళంగా ప్రకటించిన అఖిలప్రియ