P4Scheme: పి-4 పథకంలో లబ్ధిదారుడికి సిఎన్‌జీ ఆటో పంపిణీ

Read Time:  1 min
P4Scheme
P4Scheme
FONT SIZE
GET APP

తిరుపతి, ఫిబ్రవరి 23:

P4Scheme: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పి-4 లో భాగంగా బంగారు కుటుంబం పథకం కింద, స్వయం ఉపాధి అవకాశాలను ప్రోత్సహించే దిశగా తిరుచ్చానూరు ప్రాంతానికి చెందిన మంగమ్మ కుమారుడు శరవణకు, Think Gas సంస్థ ఆధ్వర్యంలో స్పాన్సర్ చేసిన సిఎన్‌జీ ఆటోను సోమవారం జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ పంపిణీ చేశారు.

Read Also:Rajahmundry Milk Incident: కల్తీ పాల ఘటనపై జగన్ ఆగ్రహం

P4Scheme
P4Scheme: Distribution of CNG auto to beneficiary under P-4 scheme

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, పి-4 బంగారు కుటుంబం పథకం ద్వారా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు స్థిరమైన ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. థింక్ గ్యాస్ వంటి కార్పొరేట్ సంస్థలు సామాజిక బాధ్యతగా ముందుకు వచ్చి సహకరించడం అభినందనీయమని చెప్పారు.

సిఎన్‌జీ వాహనాల వినియోగం వల్ల పర్యావరణ పరిరక్షణకు తోడ్పాటు లభించడంతో పాటు, ఇంధన వ్యయం తగ్గి లబ్ధిదారులకు ఆర్థిక లాభం చేకూరుతుందని కలెక్టర్ వివరించారు. ఈ అవకాశాన్ని శరవణ కుటుంబ సభ్యులు సద్వినియోగం చేసుకుని తన కుటుంబ ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకోవాలని తెలిపారు. శరవణ మాట్లాడుతూ, పి-4 బంగారు కుటుంబం పథకం ద్వారా తనకు స్వయం ఉపాధి కల్పించిన రాష్ట్ర ప్రభుత్వానికి, జిల్లా కలెక్టర్ మరియు థింక్ గ్యాస్ సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ అధికారి మురళీమోహన్, థింక్ గ్యాస్ ప్రతినిధులు ప్రసాద్, చాణక్య సంబంధిత అధికారులు, శరవణ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Pooja

రచయిత గురించి

Pooja

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.