Ontimitta Brahmotsavam: మార్చి 26 నుంచి ఒంటిమిట్ట కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు

Read Time:  1 min
Ontimitta Brahmotsavam: మార్చి 26 నుంచి ఒంటిమిట్ట కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు
FONT SIZE
GET APP

ఏప్రిల్ 1న సీతారాముల కల్యాణం

Ontimitta Brahmotsavam: ఆంధ్ర అయోధ్య ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామివారి (Sri Kodanda Rama Swamy Temple) ఆలయంలో మార్చి 27 నుండి ఏప్రిల్ 5వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరనున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 1న జరుగనున్న శ్రీ సీతారాముల కల్యాణం జరగనుంది. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను వేగవంతం చేయాలని టిటిడి జెఈవో వి. వీరబ్రహ్మం అధికారులను ఆదేశించారు. ఇప్పటివరకు చేపట్టిన బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల పనులు, ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి పనులు, భవిష్యత్తులో చేపట్టాల్సిన పనులను పరిశీలించి, అన్ని విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు.

Read Also: Kovvur Municipality: వైసీపీ చైర్‌పర్సన్ సహా నలుగురు కౌన్సిలర్ల జంప్!

Ontimitta Brahmotsavam: మార్చి 26 నుంచి ఒంటిమిట్ట కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు
Ontimitta Brahmotsavam: Ontimitta Kodandaramaswamy Brahmotsavams from March 26

ఆలయ ప్రాంగణంలో తనిఖీలు, సూచనలు

ఈ సందర్భంగా జెఈవో అధికారులతో కలిసి కోదండ రామస్వామి వారి ఆలయం ముందు తాత్కాలికంగా ఏర్పాటు చేసిన వంటశాల, ముడి సరుకులు నిల్వ ఉంచే షెడ్లను పరిశీలించి, సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. అదేవిధంగా భక్తులకు అన్నప్రదాలు పంపిణీ చేసేందుకు వీలుగా టేబులు, కుర్చీలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఆలయంలోను, యాగశాలలో మరమత్తు పనులు త్వరిత గతిన పూర్తి చేయాలన్నారు. టిటిడి స్థానిక ఆలయాల్లో ఏ విధంగా అయితే శ్రీవారి సేవకుల సేవలు వినియోగించు కుంటున్నారో అదేవిధంగా ఒంటిమిట్ట కోదండరామస్వామివారి ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి బ్రహ్మోత్సవాల ఏర్పాటలు పరిశీలిస్తున్న టిటిడి జెఇఒ వి.వీరబ్రహ్మం వినియోగించుకోవాలని సూచించారు.

కల్యాణ వేదిక వద్ద మౌలిక వసతుల పరిశీలన

ఆలయ ప్రాంగణం సమీపంలో ఫోటో ఎగ్జిబిషన్, తిక సంస్కృతి కార్యక్రమాల వేదికను పరిశీలించారు. అనంతరం కళ్యాణ వేదిక వద్ద పనులను పరిశీలించారు. భక్తులకు తలంబ్రాలు, అన్నప్రసాదాలు అందించే 17 కౌంటర్లు, ప్రవేశ, నిష్క్రమణ గేట్లను పరిశీలించారు. కల్యాణ వేదిక ప్రాంగణంలోని వసతి సముదాయం వద్ద ఉన్న జల ప్రసాదమును వినియోగంలోకి తీసుకురావాలన్నారు. కల్యాణ వేదికకు నలువైపులా పచ్చదనానికి ప్రాముఖ్యత ఇచ్చేలా తీర్చిదిద్దాలని అటవీ శాఖ అధికారులను ఆదేశించారు.

సుందరీకరణ, భక్తుల సౌకర్యాలు

ఆలయం నుండి కల్యాణ వేదిక వరకు రోడ్డు ఇరువైపుల మొక్కలు పెంచాలని సూచించారు. కళ్యాణ వేదిక వద్ద విఐపిలు బస చేసేందుకు అవసరమైన ఏర్పాట్లను ప్రణాళిక బద్ధంగా పూర్తి చేయాలన్నారు. కల్యాణ వేదిక ప్రాంగణంలో ఏర్పాటు చేసే తాత్కాలిక వంటశాల స్థలాన్ని పరిశీలించి పలు సూచనలు చేశారు. సౌకర్యవంతంగా క్యూలైన్లు, వసతి షెల్టర్లు, సూచిక బోర్డులు, తాగునీటి సౌకర్యం, తదితర ఇంజనీరింగ్ పనులు సకాలంలో పూర్తి చేయాలన్నారు. రథం తిరిగే వీధులను, ముఖ్యంగా మాడ వీధుల్లో మరమ్మతు పను లను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. భక్తులను ఆకట్టు కునేలా కటౌట్లు, విద్యుత్ దీపాలంకరణలు, పుష్పా లంక రణలు ఏర్పాటు చేయాలన్నారు. బ్రహ్మోత్సవాలకు ముందు 10 రోజుల పాటు ప్రచార రథాల ద్వారా పరిసర గ్రామాల్లో ప్రచా రం చేయాలని, బ్రహ్మోత్సవాల కరపత్రాలు పంపిణీ చేయాలన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Saritha

రచయిత గురించి

Saritha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.