📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Andhra Pradesh: ఏపీలో గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే ఎక్కడంటే?

Author Icon By Anusha
Updated: May 13, 2025 • 1:19 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఏపీలో మరో గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే అందుబాటులోకి రానుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను కలిపే ఈ హైవే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి నుంచి ఖమ్మం వరకు జరుగుతోంది. ఈ హైవేతో హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లడానికి దూరం, సమయం రెండూ తగ్గుతాయి అంటున్నారు. ఈ హైవేను దాదాపు రూ.4,609 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నారు.కొన్ని కారణాల వల్ల ఆలస్యమైంది.ప్రస్తుతం హైదరాబాద్ నుంచి విశాఖపట్నం(Hyderabad to Visakhapatnam) వెళ్లడానికి 670 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి వస్తోంది. ఈ ప్రయాణం కోసం దాదాపు 12 గంటల సమయం పడుతుంది. విజయవాడ మీదుగా వెళ్లడంతో దూరం పెరుగుతోంది. ఈ నేషనల్ హైవే పూర్తయితే విజయవాడ వెళ్లాల్సిన అవసరం లేకుండా,కేవలం 8 గంటల్లోనే 550 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లిపోవచ్చు. దీని ద్వారా 56 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది.2022లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి నుంచి ఖమ్మం వరకు 162 కిలోమీటర్ల ఈ గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవేకు భూమి పూజ చేశారు. దీనికి గ్రీన్ ఫీల్డ్ హైవే(Greenfield Highway 365బీజీగా పేరు పెట్టారు. ఈ హైవేలో ఎక్కడా మలుపులు లేకుండా, నాలుగు వరుసలుగా ప్లాన్ చేశారు.ఈ రోడ్డు కోసం 60 మీటర్ల వెడల్పుకు సరిపడా 31 గ్రామాల్లో 1,996 ఎకరాల భూమిని సేకరించారు. ప్రస్తుతం 26 మీటర్ల వెడల్పుతో నాలుగు వరుసల రహదారిని నిర్మిస్తున్నారు. భవిష్యత్తులో అవసరమైతే మరో రెండు వరుసలు నిర్మించడానికి అవకాశం ఉంది.

Andhra Pradesh: ఏపీలో గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే ఎక్కడంటే?

నేషనల్ హైవే

ఈ రోడ్డులో చిన్నవి, పెద్దవి కలిపి తొమ్మిది బ్రిడ్జిలు ఉన్నాయి. 162 కిలోమీటర్ల దూరంలో కేవలం 8 చోట్ల మాత్రమే నేషనల్ హైవే పైకి రావడానికి అనుమతి ఉంది. నాలుగు చోట్ల టోల్‌ప్లాజాలు, రెస్ట్ రూమ్స్ ఏర్పాటు చేస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండలం దగ్గర ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే ప్రారంభమవుతుంది. దేవరపల్లి-తల్లాడ నేషనల్ హైవే‌లో డైమండ్ జంక్షన్‌(Diamond Junction)కు ఇది రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ హైవే పనులు అధిక వర్షాలు, భూసేకరణలో ఆలస్యం వంటి కారణాల వల్ల నెమ్మదిగా సాగాయి. ఇప్పటికే చాలా వరకు రోడ్డు నిర్మాణ పనులు పూర్తయ్యాయంటున్నారు అధికారులు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఈ ప్రాజెక్టును రెండు భాగాలుగా విభజించగా మొదటి ప్రాజెక్టులో 90 శాతం పనులు పూర్తి చేశారు. రెండో ప్రాజెక్టులో 70 శాతం పనులు పూర్తయ్యాయి అంటున్నారు. ఈ హైవే పనుల్ని త్వరలోనే పూర్తి అందుబాటులోకి తీసుకొస్తామని చెబుతున్నారు.ఉమ్మడి తూర్పుగోదావర జిల్లాలో తుని రైల్వే స్టేషన్‌ రూపురేఖలు మారిపోతున్నాయి. అలాగే మరో కొత్త రైల్వే లైన్ వస్తోంది.

Read Also : Andhra Pradesh: ఏపీలో ఉపాధి హామీ అవకతవకలతో పలు మార్పులు

#AndhraPradeshDevelopment #APInfrastructure #EastGodavariToKhammam #HighwayProject #NewNationalHighway #TelanganaConnectivity Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.