📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

AirPort: ఏపీలో కొత్తగా ఎయిర్‌పోర్టు పనులు ప్రారంభం

Author Icon By Anusha
Updated: May 23, 2025 • 11:48 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఏపీలో కొత్తగా ఎయిర్‌పోర్టు పనులు ప్రారంభం కానున్నాయి.కొత్త ఎయిర్‌పోర్టుల నిర్మాణంపై కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు(Rammohan Naidu) కీలక ప్రకటన చేశారు. రాబోయే ఐదేళ్లలో దేశవ్యాప్తంగా 50 కొత్త విమానాశ్రయాలు నిర్మిస్తామని చెప్పారు. శ్రీకాకుళంలో జరిగిన పార్లమెంట్ స్థాయి మినీ మహానాడులో ఆయన ఈ విషయాన్ని చెప్పారు. తన పనితీరును ప్రధాని మోదీ, రాష్ట్రానికి తెస్తున్న నిధులను సీఎం చంద్రబాబు నాయుడు గమనిస్తున్నారని అందుకే ఈ లక్ష్యాన్ని పెట్టుకున్నట్లు చెప్పారు. అత్యంత చిన్న వయసులో కేంద్ర మంత్రిగా తనకు అవకాశం ఇచ్చారన్నారు రామ్మోహన్‌నాయుడు.

పరుగులు

శ్రీకాకుళం, నెల్లూరు, కుప్పం, అమరావతిలో విమానాశ్రయాలు త్వరలో ప్రారంభిస్తామన్నా రామ్మోహన్ నాయుడు. మరో మూడు చోట్ల కూడా విమానాశ్రయాల ఏర్పాటుకు పరిశీలన జరుగుతోంది అన్నారు. అమరావతికి రూ.48 వేల కోట్లు, పోలవరానికి రూ.12 వేల కోట్లు, విశాఖ ఉక్కు పరిశ్రమకు రూ.10,500 కోట్లు తీసుకురాగలిగామని, రైల్వే జోన్‌(Railway Zone)కు శంకుస్థాపన కూడా చేశామన్నారు. ఓర్వకల్లు, కొప్పర్తిలో 5 వేల ఎకరాల్లో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేయబోతున్నామన్నారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, ప్రజలు ఇబ్బంది పడకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు జాగ్రత్తగా రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారని రామ్మోహన్ నాయుడు అన్నారు. సంక్షేమం- అభివృద్ధి దిశగా రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తున్నారన్నారు.ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి, కర్నూలు మధ్య జులై 2 నుంచి విమాన సర్వీసులు ప్రారంభించబోతున్నట్లు తెలిపారు. ‘ప్రతి సోమ, బుధ, శుక్రవారాల్లో ఈ రెండు నగరాల మధ్య విమాన రాకపోకలు ఉంటాయి. ఈ విమాన సేవల ద్వారా రాష్ట్రంలో అంతర్గతంగా కనెక్టివిటీ పెరుగుతుంది. రాష్ట్ర ప్రజలకు విమాన ప్రయాణాన్ని మరింత అందుబాటులోకి తీసుకురావాలన్న ప్రయత్నాల్లో ఇది కీలకంగా మారనుంది’ అన్నారు.

AirPort: ఏపీలో కొత్తగా ఎయిర్‌పోర్టు పనులు ప్రారంభం

విమాన స‌ర్వీసు

జులై 2వ తేదీ నుంచి క‌ర్నూలు నుంచి విజ‌య‌వాడ‌కు విమాన సేవలు ప్రారంభమ‌వుతాయని ఏపీ మంత్రి టీజీ భ‌ర‌త్(TG Bharat) తెలిపారు. ప్రస్తుతం సోమ‌వారం, బుధ‌వారం, శుక్రవారాల్లో ఈ స‌ర్వీసు న‌డుస్తుండగా త్వరలోనే ప్రతి రోజూ ఈ విమాన స‌ర్వీసు న‌డుపుతామ‌ని కేంద్ర పౌర‌విమాన‌యాన శాఖ‌ మంత్రి రామ్మోహ‌న్ నాయుడు చెప్పిన‌ట్లు తెలియజేశారు. ప్రతిరోజూ క‌ర్నూలు నుంచి విజ‌య‌వాడ‌కు విమాన స‌ర్వీసు అందుబాటులోకి రావ‌డం శుభ‌ప‌రిణామం అన్నారు మంత్రి భరత్.

Read Also: Kurnool: ప్రేమించిన అమ్మాయితో పెళ్లి ఇంతలో వరుడు ఆత్మహత్య

#AndhraPradeshDevelopment #AviationBoom #NewAirports Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.