📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు

New Airport: ఏపీలో కొత్త ఎయిర్‌పోర్ట్‌లో ట్రయల్ రన్

Author Icon By Anusha
Updated: June 23, 2025 • 7:20 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్‌లో విమాన ప్రయాణాలకు మరింత పురోగతిని తీసుకువచ్చే ప్రాజెక్టులలో ప్రధానంగా నిలిచే భోగాపురం అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్ నిర్మాణం వేగంగా కొనసాగుతోంది. విజయనగరం జిల్లాలో నిర్మితమవుతున్న ఈ విమానాశ్రయం రాష్ట్రానికి కొత్త గేట్వేగా మారబోతుంది. అత్యాధునిక సౌకర్యాలతో రూపొందుతున్న ఈ ఎయిర్‌పోర్ట్, భవిష్యత్‌లో అంతర్జాతీయ స్థాయిలో రాకపోకల కోసం కేంద్ర బిందువుగా నిలిచే అవకాశం ఉంది.భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ (AAI) సాంకేతిక పరీక్షలు (ట్రయల్ రన్ వంటి) చేసింది. అయితే భోగాపురం ఎయిర్‌పోర్టులో విమానాల రాకపోకలను నియంత్రించే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) టవర్ నిర్మాణం చివరి దశకు చేరుకుంది. రన్‌వే, సిగ్నల్ వ్యవస్థ వంటి పనులు చకచకా జరుగుతున్నాయి. అయితే ఈ ఏటీసీ టవర్ నుంచి వచ్చే సంకేతాలపై AAI, DGCA సంస్థలు పరీక్షలు నిర్వహించాయి. చిన్న విమానంతో ట్రయల్ రన్ చేస్తూ ఈ పరీక్షలు చేశారు.

రన్‌వేకు దగ్గరగా

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో ఒక విమానం చక్కర్లు కొట్టింది. ఎయిర్‌పోర్ట్ నిర్మాణం ఎలా జరుగుతుందో తెలుసుకోవడానికి ఈ పరీక్షలు చేశారు.భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి ఈ విమానం రన్‌వేకు దగ్గరగా వచ్చి ల్యాండింగ్ అయ్యేందుకు ప్రయత్నించింది.కానీ మళ్లీ పైకి ఎగిరిపోయింది. ఆ విమానం ఎయిర్‌పోర్టు నిర్మాణ ప్రాంతంలో చక్కర్లు కొడుతూ సముద్రం వైపు వెళ్లిపోయింది. అక్కడ పనిచేస్తున్న కార్మికులు, చుట్టుపక్కల గ్రామ ప్రజలు దీన్ని ఆశ్చర్యంగా చూశారు. కొందరు ఈ దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. సిగ్నల్, రన్‌వే టెస్టు (Runway test) కోసం విమానం వచ్చిందని భావిస్తున్నారు. నిర్మాణంలో ఉన్న విమానాశ్రయ పరిస్థితి, చేయాల్సిన పనులు, చిన్నచిన్న మార్పులు, అడ్డంకులు వంటి వాటిని పరిశీలించడానికి అప్పుడప్పుడు నిర్వాహకులు విమానంతో ట్రయల్ రన్ నిర్వహిస్తారు. అందులో భాగంగానే ఇటీవల భోగాపురం అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు ప్రాంతంలో విమానం గాల్లో చక్కర్లు కొట్టి వెళ్లింది అంటున్నారు.

New Airport

ప్రయాణికులకు అందుబాటులోకి

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించి పనులు స్పీడ్ అందుకున్నాయి. ఈ పనుల్ని మరింత వేగవంతం చేసి త్వరగా పూర్తిచేసి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నారు. ఈ భోగాపురం ఎయిర్‌పోర్ట్ అందుబాటులోకి వస్తే, ప్రస్తుతం అందుబాటులో ఉన్న విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌ (Visakhapatnam Airport) లో ప్రయాణికులకు విమాన సేవలు నిలిపివేస్తారు. ఈ విమానాశ్రయాన్ని నేవీకి అప్పగించనున్నారు.ప్రస్తుతం రాష్ట్రంలో గన్నవరం, తిరుపతి ఎయిర్‌పోర్ట్‌లో అంతర్జాతీయ విమాన సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు భోగాపురం ఎయిర్‌పోర్ట్ నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు అందుబాటులోకి వస్తాయంటున్నారు.

Read Also: LIC:ఎల్‌ఐసీ రిక్రూట్‌మెంట్ 2025 .. డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు

#AirportDevelopment #AndhraPradeshAirport #BhogapuramAirport #FutureOfAviation #IndianAviation Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.