Nellore SP Ajitha Vejendla: ఎస్పీకి వినతుల వెల్లువ

Read Time:  1 min
Nellore SP Ajitha Vejendla: ఎస్పీకి వినతుల వెల్లువ
FONT SIZE
GET APP

Nellore SP Ajitha Vejendla: నెల్లూరు జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ (PGRS) కార్యక్రమానికి భారీ స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో బాధితుల నుండి మొత్తం 146 ఫిర్యాదులను స్వీకరించారు. జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల స్వయంగా ఫిర్యాదుదారులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

Read Also: TG Municipal Elections : ప్రజలు ఆలోచించి ఓటు వేయండి – సీఎం రేవంత్

బాధితులకు జవాబుదారీగా ఉండాలి

ఈ సందర్భంగా ఎస్పీ అజిత వేజెండ్ల మాట్లాడుతూ.. ప్రజల నుండి వచ్చే ఫిర్యాదుల పట్ల పోలీసులు ఎట్టి పరిస్థితుల్లోనూ అలసత్వం వహించకూడదని స్పష్టం చేశారు. ప్రజలతో జవాబుదారీగా వ్యవహరించాలని, స్వీకరించిన పిటిషన్లను చట్టపరిధిలో త్వరితగతిన పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు.

Nellore SP Ajitha Vejendla
Nellore SP Ajitha Vejendla: The SP was flooded with petitions.

Nellore SP Ajitha Vejendla: సినిమాలో ఛాన్స్ ఇప్పిస్తానని లక్షల్లో మోసం

ఈ వేదికలో వెలుగుచూసిన ప్రధాన ఫిర్యాదులలో సినిమా ఆశ చూపి మోసం చేసిన ఘటన ఒకటి. నెల్లూరు రూరల్ పరిధికి చెందిన ఒక మహిళ ఫిర్యాదు చేస్తూ.. తన కుమారుడికి ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన చక్రధర్ రెడ్డి అనే వ్యక్తి, సినిమాలో హీరో పక్కన తమ్ముడి పాత్ర ఇప్పిస్తానని నమ్మించి రూ. 1,06,000 వసూలు చేశాడని పేర్కొన్నారు. డబ్బు తీసుకున్న తర్వాత ఎటువంటి అవకాశం ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నాడని, తమకు న్యాయం చేయాలని కోరారు.

దుబాయ్ ఉద్యోగం పేరిట రూ. 4.50 లక్షల దగా

కోట ప్రాంతానికి చెందిన మరో బాధితుడు తన గోడును వెళ్లబోసుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన కూటికొండ రామకృష్ణ అనే వ్యక్తి, దుబాయ్‌లో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి రూ. 4,50,000 తీసుకున్నట్లు తెలిపారు. తీరా అక్కడికి వెళ్ళాక అది కేవలం విజిట్ వీసా అని, ఉద్యోగం లేదని తెలిసి వీసా గడువు ముగియడంతో తిరిగి ఇంటికి వచ్చేశానని ఆవేదన వ్యక్తం చేశారు.

అక్టోబర్ నుండి కుమారుడి ఆచూకీ కోసం తల్లి ఆవేదన

విడవలూరుకు చెందిన ఒక మహిళ తన కుమారుడు గత అక్టోబర్ నెల నుండి కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు. ఇప్పటికే విడవలూరు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైనప్పటికీ, ఇంకా ఆచూకీ లభించలేదని, కేసును లోతుగా దర్యాప్తు చేసి తన కుమారుడిని అప్పగించాలని ఆమె వేడుకున్నారు.ఈ ఫిర్యాదులన్నింటిపై స్పందించిన ఎస్పీ, బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) సిహెచ్. సౌజన్య, టౌన్ ఏఎస్పీ దీక్ష, రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు, ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Siva Prasad

రచయిత గురించి

Siva Prasad

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.