ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్య, ఐటీ శాఖల అభివృద్ధికి తాను కట్టుబడి ఉన్నట్లు మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ఉండవల్లిలోని తన నివాసంలో ఉన్నత విద్య, పాఠశాల విద్య, ఇంటర్మీడియట్ విద్య, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖలపై సమీక్ష నిర్వహించిన ఆయన, రాష్ట్ర నిరుద్యోగులకు శుభవార్త తెలిపారు. స్కిల్ పోర్టల్ (Skill Portal) ను సెప్టెంబర్ 1 నాటికి సిద్ధం చేయాలని అధికారుల్ని ఆదేశించారు. ఈ పోర్టల్ ద్వారా ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు ప్రజలకు అందుబాటులోకి వస్తాయన్నారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గాల్లో ప్రతి మూడు నెలలకు ఒకసారి ఉద్యోగ మేళాలు నిర్వహించాలని సూచించారు. ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకు ఐఐటీ, ఎన్‌ఐటీల్లో ప్రవేశాలకు భాషా సబ్జెక్టు మార్కులను సగటుగా ఇవ్వాలని తెలిపారు. ఆగస్టు నాటికి డీఎస్సీలో ఎంపికైన అభ్యర్థులకు నియామక ఉత్తర్వులు ఇవ్వాలని ఆదేశించారు.స్కిల్ (నైపుణ్య) పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వెంటనే రెజ్యూమె ఆటోమేటిక్‌గా సిద్ధమయ్యేలా ఉండాలన్నారు లోకేష్.
రాష్ట్రంలో నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చేందుకు కార్యక్రమాన్ని
ఉద్యోగాల కోసం ఈ పోర్టల్‌ను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. జిల్లా ఉపాధి కల్పన కార్యాలయాల పనితీరుపై ఒక ప్రణాళికను సిద్ధం చేయాలని మంత్రి ఆదేశించారు. ఢిల్లీ పర్యటన అనంతరం ఐటీఐల అభివృద్ధికి కేంద్రం రూ.600 కోట్లు కేటాయించిందని అధికారులు మంత్రికి వివరించారు. ఆగస్టు 7 నుంచి ‘అక్షర ఆంధ్ర’ పేరుతో రాష్ట్రంలో నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చేందుకు కార్యక్రమాన్ని ప్రారంభిస్తామన్నారు. రాష్ట్రాన్ని క్లస్టర్లుగా విభజించి నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇస్తామన్నారు. మరోవైపు ఇటీవల జరిగిన పరీక్షల్లో డీఎస్సీ (DSC) లో ఎంపికైన వారికి ఆగస్టు నాటికి నియామక ఉత్తర్వులు ఇవ్వాలని అధికారులకు సూచించారు.హైస్కూల్ ప్లస్‌లో లెక్చరర్ల నియామకంపై చర్యలు తీసుకోవాలని డిగ్రీలో యూజీసీ నిబంధనల ప్రకారం కోర్సులు ఉండాలన్నారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని
రాష్ట్రంలో కాలేజీల్లో సీట్ల భర్తీలో విద్యార్థుల అంగీకారం, ఆధార్ అనుసంధానం తప్పనిసరి అని తెలిపారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని మంత్రి లోకేష్ ఆదేశించారు. ఈ నెల 10న రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మెగా సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరారు. పాఠశాల స్థాయిలో విద్యార్థులకు కెరీర్ కౌన్సెలింగ్, వృత్తి విద్య, వ్యక్తిగత భద్రతపై శిక్షణ ఇవ్వాలని మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) సూచించారు.గతంలో ఆలస్యం అయిన నియామకాల విషయంలో ఇకనుంచి వేగంగా చర్యలు తీసుకోవాలని, విద్యారంగంలో ఖాళీలను భర్తీ చేయడం తక్షణ అవసరమని పేర్కొన్నారు.మొత్తంగా చూస్తే, మంత్రి లోకేష్ తీసుకున్న ఈ నిర్ణయాలు విద్యార్ధులు, నిరుద్యోగ యువతకు కొత్త ఆశలను కలిగిస్తున్నాయి. రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధికి నూతన దిశగా మంత్రిత్వ శాఖ అడుగులు వేస్తోంది. పోర్టల్, ఉద్యోగ మేళాలు, ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకోసం తీసుకుంటున్న చర్యలు నిరుద్యోగ యువతకు ఊరట కల్గిస్తున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Read Also: AP Rains: బంగాళాఖాతంలో ద్రోణి ప్రభావం.. ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు