Nara Lokesh: వెంకన్నతో పెట్టుకోవద్దు జగన్!.. నారా లోకేశ్

Read Time:  1 min
Nara Lokesh
Nara Lokesh
FONT SIZE
GET APP
Nara Lokesh: వెంకన్నతో పెట్టుకోవద్దు జగన్!.. నారా లోకేశ్
Nara Lokesh: Jagan, don’t mess with Venkanna!.. Nara Lokesh

Nara Lokesh: వైసీపీ ఎమ్మెల్సీలు శాసనమండలిలో కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి చిత్రపటాలను అవమానించారని, ఇది క్షమించరాని పాపమని ఏపీ మంత్రి నారా లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేత జగన్‌కు (YSJagan) దేవుడంటే భక్తి, భయం లేవని, హిందువుల మనోభావాలంటే అస్సలు లెక్కేలేదని ఆయన మండిపడ్డారు. వైసీపీ సభ్యులు శుక్రవారం శాసనమండలికి శ్రీవారి చిత్రపటాలతో హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు బూట్లు, చెప్పులతోనే స్వామివారి చిత్రపటాలను పట్టుకుని ప్రదర్శించారని, సభ ముగిశాక వాటిని అక్కడే వదిలేసి వెళ్లారని లోకేశ్ ఆరోపించారు.

Read Also: AP Job Calendar March: ఉగాదికి జాబ్ క్యాలెండర్ విడుదల: మంత్రి లోకేష్

జగన్ కు లోకేశ్ హెచ్చరిక

శ్రీవారికి చేసిన మహా పాపం కప్పిపుచ్చుకోవడానికి మహాపరాధం చేశావు జగన్. మీ వైసీపీ ఎమ్మెల్సీలు బూట్లు, చెప్పులతో వెంకటేశ్వర స్వామి చిత్రపటాలు పట్టుకుని మహాపరాధం చేశారు. అంతే కాకుండా, కౌన్సిల్‌లో ప్రదర్శించిన శ్రీవారి ఫొటోలు అక్కడే విసిరేసి వెళ్ళిపోవడం క్షమించరాని పాపం. వెంకన్నతో పెట్టుకోవద్దు జగన్!” అంటూ లోకేశ్ తీవ్రస్థాయిలో హెచ్చరించారు. ఈ మేరకు తన విమర్శలకు ఆధారంగా నారా లోకేశ్ వీడియోను కూడా పంచుకున్నారు. 

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Saritha

రచయిత గురించి

Saritha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.