📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Nara Lokesh: ఆర్డీటీపై నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు

Author Icon By Anusha
Updated: June 6, 2025 • 4:26 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాయలసీమ జిల్లాలు సహా తెలంగాణలోని పలు గ్రామీణ ప్రాంతాల్లో నిరంతరం సేవలు అందిస్తూ ప్రజల మనస్సుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న స్వచ్ఛంద సంస్థ రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ (ఆర్డీటీ) విద్యా, వైద్యం వంటి విషయాల్లో గత కొన్నేళ్లుగా ఈ ప్రాంతవాసులకు సేవలు అందిస్తూ వీరితో మమేకమైన సంస్థ. కానీ కొన్ని కారణాలు ఆర్డీటీని కలవరపెడుతున్నాయి.ఆర్డీటీ సేవల(RDT Services)పై నీలినీడలు కమ్ముకునేలా చేస్తున్నాయి. దీంతో సేవ్ ఆర్డీటీ అంటూ ఉద్యమం కూడా మొదలైంది. ఈ క్రమంలోనే ఏపీ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ఆర్డీటీపై కీలక వ్యాఖ్యలు చేశారు.పేద‌ల పాలిట వ‌రమైన రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్టు (ఆర్డీటీ) సేవలు ఆగ‌వని క్లారిటీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వంతో ఆర్డీటీ విషయమై సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు.

ఆర్డీటీ నిర్వహిస్తోందని

మంత్రి నారా లోకేష్ శుక్రవారం రోజు విలేకర్లతో మాట్లాడారు,ఆర్డీటీపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాయలసీమ, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లోని గ్రామీణులకు ఆర్డీటీ సేవలు అందిస్తోందని ఆ సేవలు నిరంత‌రాయంగా కొన‌సాగేందుకు కృషి చేస్తున్నట్లు లోకేష్ చెప్పారు. ఆర్డీటీ విషయమై కేంద్రం సంబంధిత శాఖలతో చర్చిస్తున్నట్లు నారా లోకేష్(Nara Lokesh) వివరించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని 3,500 గ్రామాల్లో ఆర్డీటీ సంస్థ సేవలు అందిస్తోందని మంత్రి నారా లోకేష్ వివరించారు. శ్రీసత్యసాయి జిల్లా బత్తలపల్లి, అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం, కణేకల్లులో మూడు ఆసుపత్రులను ఆర్డీటీ నిర్వహిస్తోందని నారా లోకేష్ వెల్లడించారు. ఏటా లక్షల మంది పేదలకు వైద్య చికిత్సలు అందిస్తోందని.మూగ, చెవిటి, మానసిక సమస్యలతో బాధపడే విద్యార్థులకు పాఠశాలలను నిర్వహిస్తోందని, ఆర్డీటీ సేవలను నారా లోకేష్ కొనియాడారు.

ఆర్డీటీ ఎలా స్థాపించబడింది?

స్పెయిన్‌కు చెందిన విన్సెంట్ ఫెర్రర్, అన్నే ఫెర్రర్ దంపతులు 1969లో రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్టును స్థాపించారు. అనంతపురం ప్రధాన కార్యాలయంగా గ్రామీణ ప్రాంతాల్లో పేదరిక నిర్మూలన కోసం ఈ స్వచ్ఛంద సంస్థ ఏర్పాటైంది. ఈ ట్రస్టు ద్వారా విద్యా, వైద్యం, స్వయం ఉపాధి కార్యక్రమాలు చేపడుతున్నారు అనంతపురం, శ్రీసత్యసాయి, నంద్యాల, కర్నూలు జిల్లాలతో పాటుగా మహబూబ్‌నగర్ జిల్లా(Mahabubnagar District)లలోని గ్రామీణ ప్రాంతాల్లో ఈ సంస్థ సేవలు అందిస్తోంది. ఆర్డీటీకి విదేశాల నుంచి వచ్చే విరాళాలు ఎక్కువ.స్పెయిన్ వంటి దేశాల నుంచి ఆర్డీటీకి ఏటా పెద్ద ఎత్తున విరాళాలు వస్తుంటాయి. ఈ విరాళాల ద్వారానే ఆర్డీటీ సంస్థ సేవా కార్యక్రమాలు చేపడుతోంది.

Nara Lokesh

కార్యక్రమాలు కొనసాగించాల్సి

అయితే ఆర్డీటీకి విదేశాల నుంచి వచ్చే నిధుల వినియోగం అనుమతులను కేంద్రం నిలిపివేసింది. ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ కింద ఆర్డీటీ విదేశీ నిధుల వినియోగం అనుమతులను ఆపివేస్తూ ఇటీవల ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో విదేశాల నుంచి వచ్చే నిధులను ( ఫారిన్ కాంట్రిబ్యూషన్) ఉపయోగించుకునేందుకు ఆర్డీటీకి వీలు లేకుండా పోయింది. దీంతో స్థానికంగా వచ్చే నిధుల (లోకల్ కాంట్రిబ్యూషన్) ద్వారానే కార్యక్రమాలు కొనసాగించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ఆర్డీటీ సేవల కొనసాగింపుపై ఆందోళన వ్యక్తమవుతోంది. అలాగే ఆర్డీటీలో పనిచేస్తున్న సుమారు 3,900 మంది ఉద్యోగుల భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకున్నాయి.

ఆరోపణలతో కేంద్రం

ఇంకోవైపు,ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఆర్డీటీ మూడు ఆస్పత్రులను నిర్వహిస్తోంది. ఇందులో పేదలకు ఉచితంగా, మధ్య తరగతి ప్రజలకు నామమాత్రపు ఫీజుతో వైద్య సేవలు అందిస్తున్నారు. అయితే ఈ ఆస్పత్రుల నుంచి వచ్చే ఆదాయాన్ని ఫారిన్ కాంట్రిబ్యూషన్ ఖాతాలో కాకుండా లోకల్ కాంట్రిబ్యూషన్ ఖాతాల్లో(local contribution accounts) జమ చేశారనే ఆరోపణలతో కేంద్రం విదేశీ నిధుల వినియోగంపై ఆర్డీటీకి అనుమతులు నిరాకరించింది. అయితే ఈ ఆరోపణలై ఆర్డీటీకి జరిమానా విధించి నిధుల వినియోగంపై అనుమతులు ఇవ్వాలని స్థానికులు, ఆర్డీటీ ప్రతినిధులు కోరుతున్నారు. ఈ క్రమంలోనే నారా లోకేష్ ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది.

Read Also: Double Decker Bus: విశాఖను పలకరించనున్న హో హో బస్సులు

#AndhraPradeshNews #NaraLokesh #RDTAndhra #RuralDevelopmentTrust #SaveRDT Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.