ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖపట్నంలో ఏర్పాటైన ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ శుక్రవారం విశాఖ చేరుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేశ్ గవర్నర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. గవర్నర్‌కు పుష్పగుచ్ఛం అందించి, మంగళగిరి శాలువాతో సత్కరించిన మంత్రి లోకేశ్, తమ పార్టీ నిర్వహించిన యువగళం పాదయాత్ర (Yuvagalam Padatyathra) లో తన అనుభవాల ఆధారంగా రూపొందించిన పుస్తకాన్ని గవర్నర్‌కు అందజేశారు.ఈ సందర్భంగా ఇద్దరి మధ్య మైత్రి వాతావరణంలో కొన్ని పౌర, అభివృద్ధి అంశాలపై చర్చలు జరిగినట్లు సమాచారం. ముఖ్యంగా విశాఖలో జరుగనున్న ‘యోగాంధ్ర’ కార్యక్రమానికి సంబంధించి ఏర్పాట్లపై మంత్రి లోకేశ్ గవర్నర్‌కు వివరించినట్లు తెలుస్తోంది.
ప్రాధాన్యం కలిగింది
ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం జూన్ 21న విశాఖపట్నంలో భారీ స్థాయిలో ‘యోగాంధ్ర’ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో దాదాపు 5 లక్షల మంది ప్రజలు పాల్గొననున్నారు. ప్రపంచ రికార్డు స్థాయిలో ఉండేలా ప్రభుత్వ యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) హాజరుకానున్న నేపథ్యంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విశేష ప్రాధాన్యత సంతరించుకుంది.ప్రధాని మోదీ పాల్గొనబోతున్న నేపథ్యంలో ఈ యోగా వేడుకకు మరింత ప్రాధాన్యం కలిగింది. విశాఖ నగరాన్ని ఈ మహా కార్యక్రమానికి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. నగరంలో యోగా, భారతీయ సంప్రదాయాలను ప్రతిబింబించే హోర్డింగ్ (Hording) లు, పతాకాలతో పాటు కళా ప్రదర్శనలతో నగరమంతా సంబర వాతావరణాన్ని తలపిస్తోంది. ఈ బృహత్తర కార్యక్రమ ఏర్పాట్లను అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. విశాఖ నగరం ప్రపంచ యోగా దినోత్సవ వేడుకలకు సర్వాంగ సుందరంగా ముస్తాబైంది.
Read Also: Electric Buses: ఏపీకి కొత్తగా ఎలక్ట్రిక్ బస్సులు..రాష్ట్రస్థాయి స్టీరింగ్ కమిటీ ఏర్పాటు