📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Nara Lokesh: కేంద్ర క్రీడల మంత్రి మండవీయతో లోకేశ్ భేటీ.. క్రీడల అభివృద్ధిపై చర్చ

Author Icon By Anusha
Updated: June 19, 2025 • 11:42 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్‌లో స్పోర్ట్స్ రంగాన్ని ప్రోత్సహిస్తూ అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో స్పోర్ట్స్ సిటీ నిర్మించాలని భావిస్తున్న ప్రభుత్వం, దీనికి అవసరమైన సహకారాన్ని కేంద్రం నుంచి పొందేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్‌ ఢిల్లీలో కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడలు, కార్మిక, ఉపాధి శాఖల మంత్రి మాన్సుఖ్ మాండవీయ‌ (Mansukh Mandaviya) ను కలిసి విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మంత్రి లోకేశ్ మాట్లాడుతూ, రాజధాని అమరావతిలో నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని, ఇందులో భాగంగా ప్రత్యేకంగా స్పోర్ట్స్ సిటీ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిందని వివరించారు. ఆటగాళ్లకు ప్రపంచ స్థాయి శిక్షణ, ఆధునిక మౌలిక వసతులు, అవసరమైన మద్దతును అందించడమే ఈ స్పోర్ట్స్ సిటీ ప్రధాన ఉద్దేశ్యమని తెలిపారు. క్రీడల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసిందని గుర్తు చేశారు.

ప్రభుత్వం సమర్పించిన ప్రతిపాదనలకు త్వరితగతిన

ఆంధ్రప్రదేశ్ ను స్పోర్ట్స్ హబ్ గా మార్చడానికి సహకారం అందించండి. రాష్ట్రంలోని పాఠశాలలు, గ్రామ స్థాయి నుంచి క్రీడల అభివృద్ధికి చేయూతను అందించండి. కేంద్ర క్రీడల మంత్రిత్వశాఖ ఆధ్వర్యాన గుంటూరు సమీపాన నాగార్జున యూనివర్సిటీ (Nagarjuna University) లో అథ్లెటిక్స్, ఆర్చరీ, వెయిట్ లిఫ్టింగ్, కాకినాడ డిస్టిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ గ్రౌండ్స్ లో హాకీ, షూటింగ్ లకు సంబంధించి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లను ఏర్పాటు చేయండి. ఖేలో ఇండియా పథకంలో క్రీడా మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా 39 ప్రాజెక్టులకు సంబంధించి రూ. 341.57 కోట్లతో ఏపీ ప్రభుత్వం సమర్పించిన ప్రతిపాదనలకు త్వరితగతిన ఆమోదం తెలపండి. తిరుపతిలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAI) రీజనల్ సెంటర్‌ను ఏర్పాటు చేయండి. ఖేలో ఇండియాలో భాగంగా అథ్లెటిక్స్, రెజ్లింగ్ స్టేట్ లెవల్ సెంటర్‌ను తిరుపతిలో నెలకొల్పండి. 

Nara Lokesh

మాండవీయ స్పందిస్తూ

26 జిల్లాల్లో జిల్లాస్థాయి ఖేలో ఇండియా సెంటర్లను ఏర్పాటు చేయండి. దేశవ్యాప్తంగా క్రీడాకారులను ప్రోత్సహించేందుకు రైల్వే స్పోర్ట్స్ కన్సెషన్ పాస్ (Railway Sports Concession Pass) లను మంజూరు చేయండి. ఏపీలో ఈఎస్ఐ హాస్పిటల్స్ అభివృద్ధికి సహకరించాలని లోకేశ్‌ విజ్ఞప్తి చేశారు. కేంద్రమంత్రి మాండవీయ స్పందిస్తూ ఏపీని స్పోర్ట్స్ హబ్ గా మార్చేందుకు పూర్తిస్థాయిలో సహకరిస్తామ‌న్నారు. ఈఎస్ఐ హాస్పిటల్స్ సేవలను మరింత విస్తృత పరుస్తామని హామీ ఇచ్చారు. అనంతరం యువగళం పాదయాత్రపై రూపొందించిన పుస్తకాన్ని కేంద్రమంత్రి మన్సుఖ్ మాండవీయకు మంత్రి లోకేశ్ (Nara Lokesh) అందజేశారు.

Read Also: TTD: దివ్యదర్శనం టోకెన్ కష్టాలు తీరేదెన్నడు?

#AmaravatiSportsCity #MansukhMandaviya #NaraLokesh #SportsInfrastructure Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.