📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం!

Nagababu : పిఠాపురం నియోజకవర్గంలో నాగబాబు పర్యటన

Author Icon By Divya Vani M
Updated: April 5, 2025 • 5:53 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

జనసేన ఎమ్మెల్సీ నాగబాబు పర్యటనలు జోరుగా సాగుతున్నాయి.అయితే ఆయన పర్యటనకు సంబంధించి కొన్ని సమస్యాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజా ఉదంతం కుమారపురం గ్రామంలో చోటు చేసుకుంది.అక్కడ నిర్మించిన సీసీ రోడ్డును అలాగే విరవ నుంచి గోకివాడ వరకు నిర్మించిన తారు రోడ్డును నాగబాబు ప్రారంభించారు.ప్రారంభోత్సవాలు ప్రశాంతంగా జరిగేలా అనిపించినా, మాత్రం ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. జనసేన, టీడీపీ కార్యకర్తలు అక్కడ ఇద్దరు వేర్వేరుగా నినాదాలు చేస్తూ హడావుడి చేసారు.టీడీపీ కార్యకర్తలు “జై వర్మ”, “జై టీడీపీ” అంటూ గట్టిగా నినాదాలు చేస్తే, జనసేన శ్రేణులు “జై పవన్ కల్యాణ్”, “జై జనసేన” అంటూ జెండాలు ఊపుతూ గట్టిగా స్పందించారు.ఇద్దరి మధ్య పోటీ వాతావరణం అక్కడ తారాస్థాయికి చేరింది. కొంతమంది ఒకరినొకరు తోసుకునేంత వరకూ వెళ్లారు.ఈ ఉద్రిక్తతకు ప్రధాన కారణం టీడీపీ ఇన్‌చార్జ్ వర్మకు ఆహ్వానం ఇవ్వకపోవడమేనని తెలుస్తోంది.

Nagababu పిఠాపురం నియోజకవర్గంలో నాగబాబు పర్యటన

వాస్తవానికి వర్మ ఈ ప్రాంతంలో టీడీపీ తరఫున బలమైన నాయకుడిగా గుర్తింపు పొందారు. ఆయన్ను పక్కన పెట్టి జరిపిన ప్రారంభోత్సవాలు టీడీపీ శ్రేణుల్లో ఆగ్రహం రేపినట్లు సమాచారం.ఇలాంటి ఘర్షణలు ఇది ఒకటే కాదు.నిన్న గొల్లప్రోలు గ్రామంలో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ ప్రారంభ వేడుకలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయి.ఆ కార్యక్రమంలో కూడా ఇరు పార్టీల కార్యకర్తలు మైక్ వాయిస్ పెంచుకొని నినాదాలు చేస్తూ ఘర్షణ సృష్టించారు.ఈ నేపథ్యంలో జనసేన అధినేత నాగబాబు ఈరోజు తన రెండవ రోజు పర్యటనను భారీ పోలీస్ బందోబస్తు మధ్య ప్రారంభించారు.కానీ అన్ని జాగ్రత్తల్ని తీసుకున్నా.గతంలో జరిగినదే మళ్లీ జరిగిపోయింది. ఈరోజు కూడా ఇరు వర్గాలు ఘర్షణకు దిగాయి.నినాదాలు తోపులాటలు మళ్లీ కనిపించాయి. నాగబాబు మాత్రం తన కార్యక్రమాన్ని ప్రశాంతంగా ముగించేందుకు ప్రయత్నించారు.అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలపై ఆయన దృష్టి సారించారు.

ప్రజల అభివృద్ధి కోసం చేస్తున్న ఈ కార్యక్రమాలు రాజకీయ లెవెల్లో ఈ రకంగా వక్రీకరించబడుతున్నాయి అన్న భావన ఆయన మాటల నుంచి కనిపించింది.పిఠాపురంలో టీడీపీ – జనసేన మధ్య పైన స్నేహపూర్వకంగా కనిపించినా, లోతుగా చూస్తే రాజకీయ విబేధాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రానున్న ఎన్నికల్లో ఈ విభేదాలు ఏ మేరకు ప్రభావం చూపుతాయో చూడాలి. ఇదిలా ఉంటే స్థానిక ప్రజలు మాత్రం అభివృద్ధి పనులకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. “ఎవరు చేస్తేనేం అభివృద్ధి అయితే చాలు” అన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. కానీ, రాజకీయ పార్టీలు మాత్రం తమ రాజకీయ లబ్ధి కోణంలో చూస్తుండటంతో. ఇలాంటి సంఘటనలు మరింత ఉద్రిక్తతకు దారితీయవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇంతటితో కాదులేండి ఇలాంటి సంఘటనలు వేరే గ్రామాల్లోనూ పునరావృతం కావచ్చన్న ఆందోళన పార్టీ నేతల్లో కూడా ఉంది.

READ ALSO : 8న అనంత జిల్లాలో వైఎస్‌ జగన్ పర్యటన

Janasena nagababu PithapuramPolitics PoliticalTensions TDP TelanganaPolitics

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.