Mudragada : కాపు సామాజికవర్గ అగ్రనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం (పద్మనాభ రెడ్డి) అంత్యక్రియలు ఆయన స్వగ్రామమైన కాకినాడ జిల్లా కిర్లంపూడిలో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అత్యంత భావోద్వేగభరిత వాతావరణంలో ముగిశాయి. సుదీర్ఘ కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ కన్నుమూసిన ముద్రగడ భౌతికకాయానికి వేలాదిగా తరలివచ్చిన అభిమానులు, రాజకీయ నేతలు అశ్రునయనాలతో వీడ్కోలు పలికారు. కుటుంబ ఆచారాల ప్రకారం దహన సంస్కారాలు నిర్వహించాల్సి ఉన్నప్పటికీ, ముద్రగడ చివరి కోరిక మేరకు ఆయన భౌతికకాయాన్ని కిర్లంపూడిలోని నివాస ప్రాంగణంలోనే ఖననం చేశారు. పోలీసుల గౌరవ వందనం, అధికారిక మర్యాదల నడుమ ఈ కార్యక్రమం ముగిసింది.
Read Also : ఏపీ బీఎల్‌వోలకు కేంద్రం తీపి కబురు!
కన్నీరు మున్నీరైన కిర్లంపూడి.. పాడె మోసి నివాళులర్పించిన వైఎస్ జగన్
ముద్రగడ పద్మనాభం అంతిమ యాత్రకు ఆయన అభిమానులు, అనుచరులు భారీ సంఖ్యలో తరలిరావడంతో కిర్లంపూడి జనసంద్రమైంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్వయంగా కిర్లంపూడి చేరుకుని ముద్రగడ భౌతికకాయానికి నివాళులర్పించారు. అంతిమ యాత్ర ప్రారంభమైన సమయంలో జగన్ స్వయంగా ముద్రగడ పాడె మోసి తన గౌరవాన్ని చాటుకున్నారు. దశాబ్దాల పాటు కాపు రిజర్వేషన్ల కోసం రాజీలేని పోరాటం చేసిన ఒక గొప్ప ప్రజా నాయకుడిని కోల్పోవడం ఏపీ రాజకీయాలకు, ముఖ్యంగా బలహీన వర్గాలకు తీరని లోటని వైఎస్ జగన్ ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :