📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Andhra Pradesh: తల్లికి వందనం పథకంపై కీలక అప్డేట్

Author Icon By Anusha
Updated: May 16, 2025 • 2:34 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తల్లికి వందనం పథకంపై కీలక అప్డేట్ వచ్చింది. ఏపీ లోని కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేర్చేందుకు వేగంగా చర్యలు తీసుకుంటోంది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇది వరకే ప్రకటించారు.ఈ పథకం ద్వారా కుటుంబంలో ఎంతమంది పిల్లలు చదువుతున్నా ఒక్కొక్కరికి రూ.15,000 ఆర్థిక సహాయం అందించనున్నారు. ఈ పథకం ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో 1 నుంచి 12వ తరగతి వరకు చదివే విద్యార్థులకు వర్తిస్తుంది.తాజాగా ఈ పథకంపై కీలక అప్డేట్ వచ్చింది. జున్ 15న తల్లికి వందనం పథకం ప్రారంభిచనున్నట్లు మంత్రి సవిత(Savitha) వెల్లడించారు. ఈ పథకం కింద చదువుకునే పిల్లలందరకీ రూ. 15 వేల చొప్పున ఆర్థిక సాయం చేస్తామన్నారు. భావితరాల భవిష్యత్తు కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు పటిష్ఠమైన విద్యా వ్యవస్థకు పునాదులు వేస్తున్నారని తెలిపారు. బీసీ యువతకు సివిల్స్, మెగా డీఎస్సీ ఫ్రీ ట్రైనింగ్ అందిస్తున్నామని మంత్రి వెల్లడించారు. టెన్త్, ఇంటర్ పరీక్షల్లో సత్తా చాటిన విద్యార్థులకు విజయవాడలో నగదు ప్రోత్సాహం అందించే కార్యక్రమంలో పాల్గొన్న ఆమె తల్లికి వందనంపై ఈ మేరకు అప్డేట్ ఇచ్చారు. జూన్ 15న అకౌంట్లలో డబ్బులు జమ చేయనున్నట్లు చెప్పారు.

తల్లికి వందనం పథకంపై కీలక అప్డేట్

పథకం

కాగా, 2025-26 విద్యా సంవత్సరానికి గాను ‘తల్లికి వందనం’ పథకం కోసం ప్రభుత్వం రూ.9,407 కోట్లు బడ్జెట్‌లో కేటాయించింది. రాష్ట్రంలో దాదాపు 81 లక్షల మంది విద్యార్థులు చదువుతుండగా వారిలో 69.16 లక్షల మంది ఈ పథకానికి అర్హులని విద్యాశాఖ అంచనా వేసింది. అయితే, ఈ పథకం పొందడానికి విద్యార్థులు కచ్చితంగా 75 శాతం హాజరు కలిగి ఉండాలి. ప్రభుత్వం ప్రస్తుతం ఈ పథకం అమలుకు సంబంధించిన మార్గదర్శకాలను రూపొందిస్తోంది. ఆర్థిక సహాయం ఒకేసారి రూ.15,000 చెల్లించాలా లేదా రెండు విడతలుగా రూ.7,500 చొప్పున చెల్లించాలా అనే అంశంపై అధికారులు చర్చిస్తున్నారు.అన్నదాత సుఖీభవ(Annadaatha Sukhibava) పథకం మొదటి విడత నిధులు కూడా అదే సమయంలో విడుదల చేయాల్సి ఉండటంతో విడతల వారీగా చెల్లింపుల అంశం తెరపైకి వచ్చింది. ఈ పథకం విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే అమలులోకి వస్తుందని ప్రభుత్వం హామీ ఇచ్చింది. అర్హులైన విద్యార్థుల సంఖ్య, అవసరమైన నిధులపై ప్రభుత్వం ఇప్పటికే ఒక అంచనాకు వచ్చింది. ఈ పథకం ద్వారా తల్లులకు ఆర్థిక సహాయం అందించడం ద్వారా పిల్లల విద్యను ప్రోత్సహించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

Read Also: IMD : ఏపీలో నైరుతి రుతుపవనాల ఎంట్రీపై ఐఎండీ ఏమంటుందంటే

#AndhraPradesh #APGovernment #EducationSupport #StudentWelfare #TalliKiVandanam Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.