📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Mirchi: లాం ఫారంలో మిరప విత్తనాలు అమ్మకానికి సిద్ధం

Author Icon By Anusha
Updated: June 19, 2025 • 10:24 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విజయవాడ : ఆచార్య రంగా విశ్వవిద్యాలయం(ఎపీ), ప్రాంతీయ ఉద్యాన పరిశోధనా స్థానం లాం ఫారంలో మిరప విత్తనాలు అమ్మకానికి సిద్దంగా ఉన్నాయి. లాం ఫారంలో ప్రస్తుతం ఎల్.సి ఎ-625, ఎల్.సి ఎ-657, ఎల్.సి. ఎ643 మిరప రకాల ఫౌండేషన్ విత్తనం అమ్మనున్నట్లు ప్రాంతీయ ఉద్యాన పరిశోధనా స్థానం అసోసియేట్ డైరెక్టర్ డాక్టర్. సి. వెంకట రమణ తెలిపారు. ఎల్. సి ఎ-643 రకం పచ్చిమిర్చికి, ఎండు మిర్చికి అనువైన రకము. కాయలు లేత ఆకుపచ్చ రంగులో పొడవుగా (1314 సెం. మీ) ఆకర్షణీయంగా ఉంటాయి. కాయలు ఎండిన తరువాత కొంచెం ముడత కలిగి ఆకర్షణీయమైన ఎరుపు రంగు కలిగి, బ్యాడగి రకం వలె ఉంటాయి. బాగా బెట్టను తట్టుకొంటుంది, కొంతవరకు జెమిని వైరస్ (Gemini virus) ను కూడా తట్టుకొంటుంది. అంతే కాక నల్లతామర పురుగు ఉధృతి ఉన్న కూడా, కొద్ది పాటి పురుగు మందుల పిచికారితో, అధిక దిగుబడినివ్వ కలిగిన రకము.ఎల్. సి ఎ-625 రకము ఎండు మిరపకు అనువైన ఈ రకం, మొక్కలు బలిస్టమైన కొమ్మలతో ఎత్తుగా పెరుగుతాయి.

నిటారైన కొమ్మలు

కణుపులు దగ్గరగా ఉండి, కాపు చిక్కగా ఉంటుంది. ప్రధాన పొలంలో నేరుగా ఎద పెట్టడానికి మిక్కిలి అనువైన రకం. కాయలు సన్నగా, మధ్యస్థ పొడవుతో (810 సెం. మీ ) ఉంటాయి. తేజ రకాన్ని పోలి ఉంటాయి. పచ్చి కాయలు ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. సూటి రకాలలో కెల్లా అధిక ఘాటు (45000-50000 ఎస్. హెచ్. యు), మంచి ఆకర్షణీయమైన ఎరుపు రంగు (6065 ఎ.ఎస్.టి.ఏ) కలిగిన రకం. కాయ తోలు పలచగా ఉండి, అధిక ఘాటు వలన కాయకుళ్ళు తెగులును కొంతవరకు తట్టుకొని, తాలు కాయలు చాలా తక్కువుగా వస్తాయి. ఎల్. సి ఎ-657 రకము తొలకరి తరువాత నేరుగా ఎద పెట్టుకోవడానికి అనువైన జెమిని వైరస్ ను తట్టుకునే రకం. మొక్కలు ఎత్తుగా, దృఢ మైన కాండంతో నిటారైన కొమ్మలు కలిగి, బలమైన వేరు వ్యవస్థ (Separate system) ను కలిగి ఉంటాయి. కాయలు పొడవుగా (1112 సెం.మీ), ముదురు ఆకుపచ్చ రంగులో ఉండి పండినప్పుడు ముదురు ఎరుపు రంగుతో తెల్లటి తొడిమ కలిగి ఆకర్షణీయంగా ఉంటాయి.

Mirchi

విత్తనము లభ్యత

కాయలు అధిక ఘాటు (50,00055,000 ఎస్. హెచ్. యు), మంచి రంగును కలిగి ఉంటాయి. అధిక బెట్టను తట్టుకునే రకం. విత్తనాలు కొనదలచిన రైతులు నేరుగా ప్రాంతీయ ఉద్యాన పరిశోధనా స్థానము, లాం ఫారం (Lam form) లో జూన్ 16 వ తేదీ మొదలు, ప్రతి రోజు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల లోపు విత్తనము లభ్యత వున్నంత వరకు పొందవచ్చును. ( రెండవ శనివారం, ప్రతి ఆదివారం శెలవు దినములు). ఈ సందర్భంగా ప్రాంతీయ ఉద్యాన పరిశోధనా స్థానము అసోసియేట్ డైరెక్టర్ డాక్టర్. సి. వెంకట రమణ (C. Venkata Ramana) గారు మాట్లాడుతూ, పైన తెలియజేసిన మిరప విత్తనాలు కేవలం ప్రాంతీయ ఉద్యాన పరిశోధనా స్థానం. లాం ఫారం నందు మాత్రమే పొందగలరని, అవే పేర్లతో బయట ఎవరైనా ఈ విత్తనాలు అమ్మజూపినట్లైతే రైతులు వాటిని ఖరీదు చేసి మోసపోవద్దని విజప్తి చేశార సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు 99898 09554 / 9440592982. ఈ అవకాశాన్ని రైతులు పద్వినియోగం చేసుకోవాలని పరిశోధనా స్థానం అసోసియేట్ డైరెక్టర్ డాక్టర్. సి. వెంకట రమణ తెలిపారు.

Read Also: Chandrababu Naidu : పన్ను వసూళ్లపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు ..

#AcharyaRangaUniversity #CapsicumCultivation #ChiliSeeds #MirchiSeeds Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.