Minister Narayana: అమరావతిలో 7 సంస్థలకు భూ కేటాయింపులు

Read Time:  1 min
Minister Narayana
Minister Narayana
FONT SIZE
GET APP

మంత్రి నారాయణ వెల్లడి

గురువారం భేటీ అయిన మంత్రివర్గ ఉపసంఘం

Minister Narayana: అమరావతిలో గతంలో వివిధ సంస్థల ఏర్పాటుకు భూములు కేటాయిస్తే వైఎస్సార్సీపీ ప్రభుత్వం చాలా ఇబ్బందులు పెట్టిందని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమరావతిలోని అనేక సంస్థలను ఇబ్బంది పెట్టిం దన్నారు. గత ప్రభుత్వ విధానాల వల్ల అనేక సంస్థలు పనులు ప్రారం భించలేదన్నారు. ఆయా కంపెనీల భూ అవసరాలు గుర్తించి అనుమతులు ఇచ్చామన్నారు. ఈకేటాయింపుల్లో ప్రధానంగా బ్యాంకులు, వివిధ కంపెనీలు, ప్రభుత్వ సంస్థలకు చెందినవి ఉన్నాయి. సీఆర్డీఏ పరిధిలో వివిధ సంస్థలకు భూ కేటాయింపులపై సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం భేటీ అ య్యింది. భూ సమస్యల పరిశీలన, రాజధానిలో పలు సంస్థలకు భూ కేటా యింపులు, కొత్తగా వచ్చే సంస్థలకు భూ కేటాయింపులు, ప్రపంచ స్థాయి సంస్థలను అమరావతికి తీసుకురావడం తదితర అంశాలపై చర్చించారు. గత ప్రభుత్వ విధానాల వల్ల ప్రారంభించలేని సంస్థలు, అదనపు స్పేస్ కోరిన వాటిని పరిశీలించి వాటికి క్లియరెన్స్లు ఇచ్చామని తెలిపారు.

Read Also:IndiaAI ImpactSummit: ఢిల్లీ ఎఐ సదస్సుకు సిఎం

Minister Narayana
Minister Narayana: Land allocations to 7 institutions in Amaravati

ఈ కేటాయింపుల్లో ప్రధానంగా బ్యాంకులు, వివిధ కంపెనీలు, ప్రభుత్వ సంస్థలకు చెందినవి ఉన్నాయని వెల్లడించారు. ఈ సమావేశంలో మొత్తం 22 అంశాలపై చర్చ జరిగిందని వీటిలో 7 కొత్త ప్రతిపాదనలు ఉన్నాయని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు. మరో 11 ప్రతిపా దనల్లో మార్పులు చేయడం జరిగిందన్నారు. బ్యాంకులు, రెసిడెన్షియల్ కాంప్లెక్స్ కోసం వారు భూమిని కొంత అడిగారు. అడిగిన వాటిని క్లియర్ చేశాం. అదే విధంగా ఇప్పటి వరకు కేటాయించిన భూముల్లో ఆయా 11 సంస్థలు ఎంత వరకు పని మొదలు పెట్టారు అవి ఎక్కడి వరకు వచ్చాయి అనే దానిపై ఈ రోజు మంత్రులందరం చర్చించడం జరిగింది. ప్రతిపాదనల్లో మార్పులు తెచ్చామని స్పష్టం చేశారు. బ్యాంకులు, రెసిడెన్షి యల్ కాంప్లెక్స్ కోసం అడిగిన వాటిని క్లియర్ చేశామని అన్నారు. సీఆర్డీఏ పరిధిలో భూకేటాయింపులపై ఈ భేటీలో చర్చించడం జరిగింది. మంత్రులు కొల్లు రవీంద్ర, కందుల దుర్గేష్, గుమ్మిడి సంధ్యా రాణిలు ఈ భేటీలో పాల్గొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Pooja

రచయిత గురించి

Pooja

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.