Minister Lokesh: మంగళగిరిలో హజరత్ అలి పీర్ల పంజా, మదర్శాను సందర్శించిన మంత్రి

Read Time:  1 min
Minister Lokesh
Minister Lokesh
FONT SIZE
GET APP

విజయవాడ : పాత మంగళగిరి 26వ వార్డులో పునర్ నిర్మించిన హజరత్ అలి పీర్ల పంజా, మదర్సాను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్(Minister Lokesh) సందర్శించారు. హజరత్ అలి పీర్ల పంజా, మదర్సా అభివృద్ధికి మంత్రి లోకేష్ రూ.2.5 లక్షల ఆర్థిక సాయం అందించారు. ముందుగా పీర్ల పంజా ప్రాంగణానికి చేరుకున్న మంత్రి లోకేష్ కు ముస్లీం మతపెద్దలు ఘనస్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

Read Also: Andhra Pradesh:మెరుగుపడుతున్న ఆర్థిక పరిస్థితి

Minister Lokesh

ఈ సందర్భంగా(Minister Lokesh) అందరితో కలిసి ఫోటోలు దిగారు. ఈ కార్యక్రమంలో పద్మశాలీ వెల్ఫేర్ అండ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ నందం అబద్దయ్య, ఏపీ ఎంఎస్ఐడీసీ ఛైర్మన్ చిల్లపల్లి శ్రీనివాస రావు, గుంటూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావుతో పాటు హజరత్ అలి కమిటీ అధ్యక్షులు షేక్ సుభాని, షేక్ రఫి, షేక్ జాని, షేక్ సాదిక్, షేక్ మహ్మద్ అలీ, షేక్ ఆషిక్, స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Pooja

రచయిత గురించి

Pooja

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.