हिन्दी | Epaper
స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Mineral Exploration: ఏపీలో ఖనిజాన్వేషణకు ప్రభుత్వం ఆహ్వానం

Anusha
Mineral Exploration: ఏపీలో ఖనిజాన్వేషణకు ప్రభుత్వం ఆహ్వానం

ఆంధ్రప్రదేశ్ లో ఖనిజ సెక్టార్‌నుఅభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.నోటిఫైడ్‌ ప్రైవేట్‌ ఏజెన్సీలను ఖనిజాన్వేషణకు ఆహ్వానిస్తున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర(Kollu Ravindra) తెలిపారు. రాష్ట్రంలో సున్నపురాయి, మాంగనీస్, బంగారం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. వీటిని ఉపయోగించుకుంటే పరిశ్రమలు అభివృద్ధి చెందుతాయంటున్నారు. విజయవాడలో కేంద్ర గనుల శాఖ, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించిన సదస్సులో ఖనిజాన్వేషణ, వెలికి తీయడం, వేలం సహా పలు కీలక అంశాలపై చర్చించారు. ప్రధానంగా ఖనిజ నిల్వల వెలికితీతపై చర్చ జరిగింది. మైనింగ్ ఆధారిత పరిశ్రమలకు ప్రభుత్వం సహకరిస్తుందని రాష్ట్రంలో ఖనిజాల అన్వేషణకు నోటిఫైడ్ ప్రైవేట్ ఏజెన్సీ(Notified Private Agency)లను ఆహ్వానిస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఖనిజాలను వాటిని ఉపయోగించుకుంటే పరిశ్రమల ముఖచిత్రం మారుతుందని వ్యాఖ్యానించారు.

సమావేశం

మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ,ఏపీ,కేంద్ర గనుల శాఖ నిర్దేశించిన స్టేట్ మైనింగ్ రెడీనెస్ ఇండెక్స్‌లో మూడింట్లో ‘ఏ’ కేటగిరీలో నిలిచిందన్నారు. మైనింగ్ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేస్తే ఉద్యోగాలు వస్తాయని, ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. అలాంటి వారికి ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని హామీ ఇచ్చారు. ఏపీలో ఖనిజాల అన్వేషణ(Mineral exploration), వాటిని వెలికితీయడంపై జీఎస్‌ఐ, ఐబీఎం, ఎంఈసీఎల్‌తో కలిసి సమావేశం నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ సదస్సులో గనుల శాఖ కార్యదర్శి ప్రవీణ్ కుమార్, ఎంఈసీఎల్‌ డైరెక్టర్ పంకజ్ పాండే, జీఎస్‌ఐ డైరెక్టర్ సత్యనారాయణ మహాపాత్రో, ఐబీఎం కంప్ట్రోలర్ ఆఫ్ మైన్స్ శైలేంద్ర కుమార్‌లు పాల్గొన్నారు.

Mineral Exploration: ఏపీలో ఖనిజాన్వేషణకు ప్రభుత్వం ఆహ్వానం
Mineral Exploration: ఏపీలో ఖనిజాన్వేషణకు ప్రభుత్వం ఆహ్వానం

అభివృద్ధి

సీఎస్ విజయానంద్ మాట్లాడుతూ,త్వరలో ఎగువ సీలేరులో 1,350 మెగావాట్ల పంప్డ్ స్టోరేజి విద్యుత్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. ఏపీ జెన్‌కో ప్రాజెక్టు(Genco project)లపై ఆయన అధికారులతో సమీక్షించారు. ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలని, శాఖల మధ్య సమన్వయం ఉండాలని ఆయన అన్నారు. అటవీ భూముల అనుమతుల కోసం చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే కమలపాడు, యాగంటి, రాజుపాలెం, అరవేటిపల్లి, గడికోత, దిన్నేపల్లి ప్రాంతాల్లో పీఎస్‌పీ ప్రాజెక్టు(PSP project)లకు డీపీఆర్‌లు సిద్ధం చేయాలని ఆదేశించారు. గత ఆర్థిక సంవత్సరంలో జెన్‌కో విద్యుత్ ఉత్పత్తి 14 శాతం పెరిగిందన్నారు. రాష్ట్రంలో విద్యుత్ అవసరాలకు తగ్గట్టుగా వనరులను అభివృద్ధి చేయాలన్నారు. జెన్‌కో చేపట్టిన ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలని ఆయన అధికారులకు సూచించారు. 2027 జనవరి నాటికి పోలవరం హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు పూర్తవుతుందని జెన్‌కో ఎండీ కేవీఎన్ చక్రధర్‌బాబు తెలిపారు.

Read Also: Plot Allotment: ఏపీలో ప్లాట్ల కేటాయింపునకు కొత్త మార్గదర్శకాలు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870