📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

VishakaPatnam Metro: విశాఖలో అక్టోబర్ నుండి మెట్రో పనులకు శ్రీకారం

Author Icon By Anusha
Updated: May 22, 2025 • 10:32 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విశాఖ మెట్రోకు సంబంధించి పనులు ఈ ఏడాది అక్టోబరులో మొదలు కానున్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి రానుండటంతో మెట్రో పనుల్ని వేగవంతం చేయాలని భావిస్తున్నారు. మున్సిపల్‌శాఖ మంత్రి నారాయణ, ఇతర ప్రజాప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.ప్రధానంగా ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధిపై చర్చించారు. విశాఖపట్నంలో డబుల్ డెక్కర్ విధానంలో మెట్రో రైలు నిర్మాణం చేపడతామని భోగాపురం విమానాశ్రయానికి(Bhogapuram Airport)అనుసంధానంగా రహదారులు నిర్మిస్తారన్నారు మంత్రి,టిడ్కో ఇళ్లను దసరా నాటికి లబ్ధిదారులకు అందిస్తామని అమృత్ పథకం కింద తాగునీటి పనులు చేపడతామన్నారు.విశాఖపట్నం మెట్రో రైలును డబుల్ డెక్కర్ మోడల్‌లో నడపడానికి డీపీఆర్ తయారుచేసి కేంద్రానికి సమర్పించామన్నారు మంత్రి నారాయణ(Municipal Minister Narayana). విశాఖపట్నం ప్రజల కోసం సెమీ రింగ్ రోడ్డు నిర్మాణం కూడా చేస్తామన్నారు. భోగాపురం విమానాశ్రయం వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి పూర్తవుతుందని,దానికి అనుసంధానం చేస్తూ 22 రహదారులను ప్రతిపాదించగా, 15 రహదారుల పనులు మొదలయ్యాయి అన్నారు.మిగిలిన రోడ్ల కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారన్నారు.

తదితరులు

గత ప్రభుత్వం టిడ్కో ఇళ్లను పూర్తి చేయలేదని రాష్ట్రంలో 2014-19 మధ్య ఏడు లక్షల టిడ్కో ఇళ్లు నిర్మించాలని ప్రతిపాదించామన్నారు. గత ప్రభుత్వం రెండు లక్షల ఇళ్లు కూడా పూర్తి చేయలేకపోయిందని టిడ్కో ఇళ్ల నిర్మాణం పూర్తి చేయడానికి రూ.7 వేల కోట్లు ఖర్చు అవుతుందన్నారు. దసరా నాటికి లబ్ధిదారులకు ఇళ్లను అందిస్తామని హామీ ఇచ్చారు. అమృత్ పథకం కింద రూ.834 కోట్లతో తాగునీటి పనులు చేస్తామని మంత్రి నారాయణ తెలిపారు.ఈ సమీక్షా సమావేశంలో పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు(MP Kalisetti Appalanaidu, ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణమూర్తి, వెలగపూడి రామకృష్ణబాబు, విష్ణుకుమార్‌రాజు, వంశీకృష్ణ శ్రీనివాస్, పంచకర్ల రమేష్‌బాబు, అదితి గజపతిరాజు, లోకం నాగమాధవి, కోళ్ల లలితకుమారి తదితరులు పాల్గొన్నారు. విశాఖతో పాటుగా ఉత్తరాంధ్ర జిల్లా అభివృద్ధిపై ప్రధానంగా చర్చ జరిగింది.

VishakaPatnam Metro: విశాఖలో అక్టోబర్ నుండి మెట్రో పనులకు శ్రీకారం

మెట్రో రైలు

విశాఖపట్నం మెట్రో రైలు ప్రాజెక్టు మొదటి దశలో స్టీల్‌ప్లాంట్‌-కొమ్మాది, గురుద్వారా-పాత పోస్టాఫీసు, తాటిచెట్లపాలెం-చినవాల్తేరు పట్టాలెక్కించనున్నారు. గాజువాక, విశాఖ గ్రామీణం, మహారాణిపేట, సీతమ్మధార మండలాల పరిధిలో 42 మెట్రో స్టేషన్లు రానున్నాయి. స్టీల్‌ప్లాంట్‌-కొమ్మాది మధ్య 34.40 కి.మీ.లలో 29 స్టేషన్లు, గురుద్వారా- పాత పోస్టాఫీసు మధ్య 5.08 కి.మీ.లలో ఆరు స్టేషన్లు, తాటిచెట్లపాలెం-చినవాల్తేరు మధ్య 6.75 కి.మీ.లలో 7 స్టేషన్లు రానున్నాయి.మెట్రో స్టేషన్ల(Metro stations) విషయానికి వస్తే,కారిడార్‌-1లో ‘స్టీల్‌ప్లాంటు, వడ్లపూడి, శ్రీనగర్, చినగంట్యాడ, గాజువాక, ఆటోనగర్, బీహెచ్‌పీవీ, షీలానగర్, విమానాశ్రయం, కాకానినగర్, ఎన్‌ఏడీ, మాధవధార, మురళీనగర్, ప్రభుత్వ పాలిటెక్నిక్, కంచరపాలెం, తాటిచెట్లపాలెం, అక్కయ్యపాలెం, గురుద్వారా, మద్దిలపాలెం, ఎంవీపీ కాలనీ, వెంకోజిపాలెం, హనుమంతువాక, ఆదర్శనగర్, జూ పార్క్, ఎండాడ, క్రికెట్‌ స్టేడియం, శిల్పారామం, మధురవాడ, కొమ్మాది’ ఉన్నాయి.

Read Also: AP Weather : నేడు, రేపు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు

#AndhraPradeshProjects #BhogapuramAirport #VisakhapatnamMetro #VizagDevelopment Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.