📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Andhra Pradesh: శేషాచలం అడవుల్లో భారీ అగ్నిప్రమాదం స్పందించిన పవన్ కల్యాణ్

Author Icon By Anusha
Updated: May 2, 2025 • 1:10 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామివారు వెలసిన శేషాచలం అడవులు అగ్ని ప్రమాదం బారిన పడ్డాయి. తిరుమల సమీపంలో కార్చిచ్చు చెలరేగాయి.అడవుల్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. తిరుమల సమీపంలోని పాప వినాశనం డ్యామ్ అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. క్రమంగా మంటలు విస్తరించాయి. కుమారధార, పసుపుధార మంటలు వ్యాపించాయి.సమాచారం అందిన వెంటనే చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య రాయచోటి జిల్లాల అటవీ శాఖ అధికారులు అప్రమత్తం అయ్యారు. మంటలు వ్యాప్తి చెందకుండా తక్షణ చర్యలు చేపట్టారు. ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు మంటలను ఆర్పివేసే ప్రక్రియ చేపట్టారు. ఎండ తీవ్రతే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని ప్రాథమికంగా అంచనావేశారు.

ఫారెస్ట్ రేంజ్‌

దీనిపై అటవీ మంత్రిత్వ శాఖను పర్యవేక్షిస్తోన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆరా తీశారు. తిరుమల శేషాచల అడవుల్లో ప్రమాదవశాత్తు జరిగిన అగ్ని ప్రమాదం కారణంగా మంటలు చెలరేగిన ఘటనపై అటవీశాఖ అధికారులు ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటివ్ ఆఫీసర్ పీసీ నాయక్, ఫారెస్ట్ అడ్వైజర్ మల్లికార్జున్‌తో ఆయన ప్రత్యేకంగా సమీక్షించారు. అన్నమయ్య జిల్లా బాలపల్లి ఫారెస్ట్ రేంజ్‌ పరిధిలోని ఓ గ్రామంలో తొలుత మంటలు చెలరేగినట్లు వెల్లడించారు. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగినట్లు ధృవీకరించారు. తిరుపతి, అన్నమయ్య జిల్లాల నుండి సబ్ డివిజినల్ ఫారెస్ట్ ఆఫీసర్ సుబ్బరాజు నేతృత్వంలో ఫారెస్ట్ రేంజ్ అధికారులు, 30 మంది సిబ్బంది, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు అప్రమత్తమై మంటలను ఆర్పే ప్రక్రియ చేపట్టినట్లు తెలిపారు. కార్చిచ్చును అదుపులోకి తెస్తున్నామని వివరించారు.

సంచరించే

మంటలు ఉధృతంగా వ్యాప్తి చెందకుండా అన్ని చర్యలు చేపట్టాలని, అదేవిధంగా వేసవి తాపానికి కార్చిచ్చులు రగిలే అవకాశం ఎక్కువగా ఉండటంతో, ఇలాంటి ఘటనలు జరగకుండా అన్ని రకాలుగా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అటవీ శాఖ అధికారులకు పవన్ కళ్యాణ్ ఆదేశించారు.వన్యప్రాణులు అధికంగా సంచరించే ప్రాంతం కావడంతో, వాటికి ఎటువంటి ప్రాణహాని జరగకుండా చూసుకోవాలని పవన్ కల్యాణ్ సూచించారు. వన్యప్రాణుల సంరక్షణ చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. అదే విధంగా మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న అటవీ శాఖ సిబ్బందిని, అగ్నిమాపక సిబ్బందిని, అధికారులను ప్రత్యేకంగా అభినందించారు.

Read Also: Revanth Reddy: మరి కాసేపట్లో ఢిల్లీకి రేవంత్ రెడ్డి పయనం

#ForestFireAlert #SeshachalamForestFire #SriVenkateswaraSwamy #TirumalaFire #TirumalaHills #TirupatiNews Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.