📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Andhra Pradesh: ఏపీలో ఉపాధి హామీ అవకతవకలతో పలు మార్పులు

Author Icon By Anusha
Updated: May 13, 2025 • 1:09 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఏపీ  ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది,ఉపాధి హామీ పథకంలో జరుగుతున్న పనుల్లో మార్పులు చేయనుంది. చెరువుల్లో పూడిక తీయడం, కందకాలు తవ్వడం వంటి పనుల్ని తగ్గించనున్నారు.వాటి స్థానంలో రైతులకు మేలు చేసే పనులకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఉపాధి హామీ పథకంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఏటా రూ.10 వేల కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారు.అయితే ఈ పనుల్లో కొన్ని అవకతవకలు జరుగుతున్నాయని గుర్తించారు.అందుకే, వ్యక్తిగత లబ్ధి చేకూర్చే పనులపై దృష్టి పెట్టనున్నారు.దీనికోసం 94 రకాల పనులను ఎంపిక చేశారు.ఉపాధి హామీ పథకం(Employment Guarantee Scheme)లో ఒకే రకమైన పనులు చేస్తున్నారు.కోస్తా, ఉత్తరాంధ్ర జిల్లాల్లో చెరువుల్లో పూడిక తీత పనులు ఎక్కువగా చేస్తున్నారు. రాయలసీమలో తవ్వే పనులు ఎక్కువగా ఉంటాయి. వీటిలో చాలా అవకతవకలు జరుగుతున్నాయని తేలింది. దొంగ మస్టర్లు వేయడం, కొలతల్లో తప్పులు చేయడం వంటి ఆరోపణలు వచ్చాయి. కొందరు అధికారులు కుమ్మక్కై నిధులను దుర్వినియోగం చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.

ఉపాధి హామీ అవకతవకలతో పలు మార్పులు

పారదర్శకత

ప్రభుత్వం రైతులకు వ్యక్తిగతంగా ఉపయోగపడే పనులకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించింది. పండ్ల తోటలు వేయడం, పూల మొక్కలు పెంచడం, పంట కుంటలు తవ్వడం వంటి పనులు చేయొచ్చు. వీటితో పాటుగా మామిడి మొక్కల చుట్టూ కందకాలు తవ్వడం, కంపోస్ట్ పిట్‌(Compost pit)లు, ఇంకుడు గుంతల పనులు కూడా చేయొచ్చు. రైతులు తమ పొలాల్లో ఈ పనులను చేసుకోవచ్చు. ఇలాంటి పనుల్లో దొంగ మస్టర్లు వేయడానికి సిబ్బంది సాహసం చేయరని అధికారులు భావిస్తున్నారు. వీటితో పాటుగా గ్రామాల్లో అభివృద్ధి పనులు కూడా చేయనున్నారు. కొండలపై పచ్చదనం పెంచడానికి మొక్కలు నాటడం, తాగునీటి సమస్యను పరిష్కరించడానికి దేవాలయాల దగ్గర కోనేర్లు బాగు చేయడం, పాత చెరువులను అభివృద్ధి చేయడం వంటి మంచి పనులు చేస్తారు. గిరిజన ప్రాంతాల్లో నీటి సంరక్షణ కోసం ‘స్ప్రింగ్‌ షెడ్‌’(Spring Shed) కార్యక్రమాలు చేపడతారు. కేంద్ర ప్రభుత్వం 266 రకాల పనులకు అనుమతి ఇచ్చింది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం 94 పనులతో ఒక జాబితాను తయారు చేసింది. ఈ జాబితాను గ్రామాల్లో ప్రదర్శిస్తారు. గ్రామసభల్లో ప్రజలు తమకు కావలసిన పనులను ఎన్నుకోవచ్చు.అయితే, పనుల్లో పారదర్శకత కోసం శ్రామికులతోనే తనిఖీలు చేయించాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సూచించింది. తనిఖీల కోసం గ్రామ కమిటీలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తోందట. ఆయా గ్రామాల్లో సర్పంచ్ నేతృత్వంలో ఈ కమిటీలు ఉంటాయి. ఇందులో చురుగ్గా పనిచేసే ఉపాధి హామీ కూలీలను సభ్యులుగా నియమిస్తారు.పంచాయతీ ఎన్నికల తర్వాత ఈ విధానం అమల్లోకి వచ్చే అవకాశం ఉంది అంటున్నారు.

Read Also: Visakhapatnam: విశాఖపట్నం జూకి తరలించిన తాబేళ్లు

#EmploymentGuarantee #JobScheme #RuralDevelopment Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.