📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం స్కూల్స్ కు సంక్రాంతి సెలవులు ఖరారు ఐదేళ్లు దాటిన పిల్లలకు ఆధార్ కార్డ్ అప్డేట్ తప్పనిసరి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు నంద్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం స్కూల్స్ కు సంక్రాంతి సెలవులు ఖరారు ఐదేళ్లు దాటిన పిల్లలకు ఆధార్ కార్డ్ అప్డేట్ తప్పనిసరి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య ఏపీలో మరో 4 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు ‘పల్లె వెలుగు’కు ఎసి బస్సులు మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి సెలవులు

Madanapalle: భార్య కళ్లెదుటే భర్త హత్య..తల పట్టుకున్న పోలీసులు

Author Icon By Anusha
Updated: June 17, 2025 • 11:27 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఆదివారం రాత్రి ఒక దారుణ ఘటన చోటుచేసుకుంది. మదనపల్లిలో జరిగిన రియల్ ఎస్టేట్ ఏజెంట్ (Real estate agent) హత్య పలు అనుమానాలకు దారితీస్తోంది. 33 ఏళ్ల గంగాధర్ దారుణ హత్యలో అసలు నిజాలు రాబట్టే పనిలో పోలీసులు సొంత మనుషులనే అనుమానిస్తుండటం చర్చనీయాంశంగా మారింది. ఆదివారం అర్ధరాత్రి ఇంట్లో నిద్రిస్తున్న గంగాధర్ (Gangadhar) ను భార్య బిడ్డల ముందే బండ రాళ్లతో కొట్టి హత మార్చిన దుండగుల అసలు టార్గెట్ ఏంటన్న దానిపై పోలీసులు ఫోకస్ పెట్టారు. రాత్రి 11 గంటల సమయంలో ఇంట్లోకి చొరబడ్డ ఆరుగురు వ్యక్తులు గంగాధర్ ను భార్య వనిత కళ్ళ ఎదుటే కర్రలతో దాడి చేసి బండ రాళ్లతో కొట్టి హత మార్చారు.

అనుమానిస్తున్న పరిస్థితి

హత్యకు గురైన గంగాధర్ కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న మదనపల్లి రూరల్ పోలీసులు (Madanapalle Rural Police) హత్యకు గల కారణాలపై లోతైన దర్యాప్తు కొనసాగిస్తున్నారు.గంగాధర్ కు ఉన్న శత్రుత్వం, గొడవలపై ఆరా తీసిన పోలీసులు భార్యను కూడా అనుమానిస్తున్న పరిస్థితి ఏర్పడింది. గంగాధర్ భార్య వనితను అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పోలీసులు, మరికొందరు అనుమానితులు కూడా విచారణ పేరుతో పీఎస్‌కు తరలించారు.

Madanapalle

పోలీసుల విచారణ

భార్య సహకారంతో పక్కా స్కెచ్ తోనే హత్య జరిగినట్లు ప్రాథమికంగా అనుమానిస్తున్న పోలీసులు, ఈ మేరకు సాక్షాలను సేకరించే పనిలో పడినట్లు తెలుస్తోంది. సినిమా థ్రిల్లర్‌ (Movie thriller) ను తలపించే కేసుగానే పోలీసుల విచారణ కూడా కొనసాగుతోంది. గంగాధర్ ను హత మార్చిన వారెవరో కనుగొనే పనిలో ఉన్న పోలీసులు తొందర్లోనే మిస్టరీని చేధిస్తామని చెబుతున్నారు. గంగాధర్ హత్య కేసులో భార్య ప్రమేయం ఉందా లేదా అన్న కోణంతో పాటు ఆరుగురు కలిసి చేసిన ఈ హత్య వెనుక ఉన్నదెవరన్నదే పోలీసులకు సైతం మిస్టరీగా మారింది.

Read Also: Markapuram: ఎసిబికి చిక్కిన అవినీతి చేప

#annamayyadistrict #GangadharMurder #Madanapalle #RealEstateAgent Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.