Nagababu : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోదరుడు, జనసేన పార్టీ ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన పదవిని కేటాయించింది. ఆయనను ఏపీ పర్యావరణ, అటవీశాఖ గ్రీన్ నిర్వాహక కమిటీ చైర్మన్‌గా నియమిస్తూ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవితో పాటు నాగబాబుకు ప్రత్యేకం గా రాష్ట్ర క్యాబినెట్ హోదాను కూడా ప్రభుత్వం కల్పించింది. గతంలో ఏపీ మంత్రివర్గ విస్తరణ సమయంలో ఆయనకు మంత్రి పదవి దక్కుతుందనే వార్తలు గట్టిగా వినిపించిన నేపథ్యంలో, ప్రస్తుతం క్యాబినెట్ హోదాతో కూడిన ఈ కీలక నియామకం జరగడం రాజకీయ వర్గాల్లో విశేష ప్రాధాన్యతను సంతరించుకుంది.
Read Also : నేటి నుంచి ఏపీలో అత్యవసర సేవలు బంద్!

జనసేన శ్రేణుల్లో ఉత్సాహం: పర్యావరణ పరిరక్షణ దిశగా అడుగులు
ఈ నియామకవార్త వెలువడటంతో జనసేన పార్టీ నాయకులు, శ్రేణులు మరియు అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ ఎదుగుదలలో మరియు ఎన్నికల ప్రచారంలో నాగబాబు అందించిన సేవలకు తగిన గుర్తింపు లభించిందని వారు కొనియాడారు. గ్రీన్ నిర్వాహక కమిటీ చైర్మన్‌గా బాధ్యతలు చేపడుతున్న నాగబాబు, రాష్ట్రంలో పర్యావరణ సమతుల్యత సాధించడం, అటవీ సంపదను పరిరక్షించడం మరియు విస్తారమైన హరితహారం (గ్రీన్ కవర్) పెంపొందించేందుకు తనదైన శైలిలో కృషి చేస్తారని పార్టీ వర్గాలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :