हिन्दी | Epaper

Kethireddy Venkatarami Reddy: క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు

Anusha
Kethireddy Venkatarami Reddy: క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు

Kethireddy Venkatarami Reddy: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అన్ని రకాల లబ్ధి పొంది, ఎన్నికల్లో ఓటమి ఎదురవగానే వెన్నుపోటు పొడిచి ఇతర పార్టీల్లోకి వెళ్లే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించబోనని ఆయన స్పష్టం చేశారు. “వేరే పార్టీలోకి వెళ్లి మళ్లీ తిరిగి వస్తామంటే రానిచ్చే ప్రసక్తే లేదు.. అలాంటి వారు వస్తే గేటు దగ్గరే చెప్పుతో కొడతా” అంటూ తనదైన శైలిలో హెచ్చరించారు.

Read Also: Job-Fraud: మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం

అండగా నిలిచిన ప్రజలు, కార్యకర్తలకు రుణపడి ఉంటా

క్యారెక్టర్ లేని వాళ్లను, అర్హత లేని వాళ్లను రానివ్వను అంటూ మాస్ వార్నింగ్ ఇచ్చారు. బంధువులం, స్నేహం అంటూ మళ్లీ పార్టీలోకి రావాలని ప్రయత్నం చేసినా ఎంట్రీ ఉండదన్నారు. కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి వైఎస్సార్‌సీపీ నేతలతో నిర్వహించిన సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు.వైఎస్సార్‌సీపీకి కార్యకర్తలే ముఖ్యమని.. జగనన్న ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రాగానే కార్యకర్తలకే ప్రాధాన్యం ఇస్తామన్నారు. ధర్మవరం నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయాలని నేతలు, కార్యకర్తలకు సూచించారు.

Kethireddy Venkatarami Reddy: Those without character have no place in the party
Kethireddy Venkatarami Reddy: Those without character have no place in the party

ధర్మవరంలో ఏకంగా 15వేలకుమందికిపైగా పార్టీ పదవులు ఇచ్చామని.. రాష్ట్రంలో మొదటిసారి ఇంతమందికి బాధ్యతలు అప్పగించామన్నారు. గత 20 ఏళ్లుగా ఓడినా, గెలిచినా తనకు అండగా నిలిచిన ప్రజలు, కార్యకర్తలకు రుణపడి ఉంటానన్నారు. కష్టకాలంలో పార్టీకి అండగా నిలబడిన నేతలు, కార్యకర్తల్ని కచ్చితంగా ఆదుకుంటానన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం అందరూ కలిసి పనిచేయాలన్నారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను పార్టీ నేతలు, కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. జగనన్న ప్రభుత్వంలో ప్రజలకు న్యాయం జరిగిందని.. కానీ చంద్రబాబు ప్రభుత్వంలో టీడీపీ నేతలు, కార్యకర్తలకే లబ్ధి జరుగుతోందన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

బ్యాంకు ఛార్జీలపై పార్లమెంట్లో రాఘవ్ చద్దా ఫైర్

బ్యాంకు ఛార్జీలపై పార్లమెంట్లో రాఘవ్ చద్దా ఫైర్

జార్ఖండ్‌లో రైలు ప్రమాదం.. ముగ్గురు మృతి

జార్ఖండ్‌లో రైలు ప్రమాదం.. ముగ్గురు మృతి

అదానీ విద్యుత్ ఒప్పందాన్ని సవరించాలని ప్రభుత్వం యోచన

అదానీ విద్యుత్ ఒప్పందాన్ని సవరించాలని ప్రభుత్వం యోచన

VSR ఏవియేషన్‌తో హెరిటేజ్‌కు ఎలాంటి సంబంధం లేదని లోకేశ్ స్పష్టం

VSR ఏవియేషన్‌తో హెరిటేజ్‌కు ఎలాంటి సంబంధం లేదని లోకేశ్ స్పష్టం

హైదరాబాద్‌లో కాసేపట్లో భారీ వర్షం..

హైదరాబాద్‌లో కాసేపట్లో భారీ వర్షం..

గుండె సేఫ్‌గా ఉండాలంటే ఈ పండ్ల‌ను రోజూ తినాలి..

గుండె సేఫ్‌గా ఉండాలంటే ఈ పండ్ల‌ను రోజూ తినాలి..

ఉగాది కానుకగా ఇందిరమ్మ ఇళ్లు.

ఉగాది కానుకగా ఇందిరమ్మ ఇళ్లు.

వాడకంలో లేని పీఎఫ్ మొత్తం నేరుగా మీ బ్యాంక్ అకౌంట్‌లోకి..

వాడకంలో లేని పీఎఫ్ మొత్తం నేరుగా మీ బ్యాంక్ అకౌంట్‌లోకి..

నాగర్‌కర్నూల్‌లో బాధితులతో కలిసి కేటీఆర్ పోరు

నాగర్‌కర్నూల్‌లో బాధితులతో కలిసి కేటీఆర్ పోరు

విద్యుత్ ప్లాంట్లు కూడా మీరే కట్టాలి.. టెక్ కంపెనీలకు ట్రంప్ బాంబ్

విద్యుత్ ప్లాంట్లు కూడా మీరే కట్టాలి.. టెక్ కంపెనీలకు ట్రంప్ బాంబ్

థాయ్‌లాండ్‌లో 72 పులుల మృతి

థాయ్‌లాండ్‌లో 72 పులుల మృతి

కేరళనే కాకుండా పలు రాష్ట్రాలు, నగరాల పేర్లలో మార్పులు

కేరళనే కాకుండా పలు రాష్ట్రాలు, నగరాల పేర్లలో మార్పులు

📢 For Advertisement Booking: 98481 12870