📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Kethireddy Pedda Reddy: తాడిపత్రిలో హై టెన్షన్.. కేతిరెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

Author Icon By Anusha
Updated: June 29, 2025 • 11:47 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ముఖ్యంగా అనంతపురం జిల్లా తాడిపత్రిలో పరిణామాలు ఒకేసారి ఉద్రిక్త మలుపులు తిరిగాయి. వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి గత సంవత్సరం నుంచి తాడిపత్రికి దూరంగా ఉన్న నేపథ్యంలో, తాజాగా ఆయన ఊహించని రీతిలో తాడిపత్రిలోని తన స్వగృహానికి వచ్చారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే స్పందించి ఆయన్ను అదుపులోకి తీసుకోవడం స్థానికంగా తీవ్ర ఉత్కంఠను రేపింది.ఇదిలా ఉండగానే కేతిరెడ్డి రాక గురించి తెలుసుకున్న జేసీ వర్గీయులు ఆయన తాడిపత్రి రావడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు.కేతిరెడ్డి వచ్చిన విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి. తన అనుచరులతో కలిసి పెద్దారెడ్డి (Peddareddy) ఇంటికి బయలు దేరారు. మరోవైపు కేతిరెడ్డి వచ్చిన విషయం తెలుసుకున్న పరిసర గ్రామాల టీడీపీ కార్యకర్తలు ఆయన ఇంటికి వద్దకు చేరుకున్నారు.

ఆయనను అదుపులోకి తీసుకుని అనంతపురం

కేతిరెడ్డి ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించారు. దీంతో కేతిరెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి నివాసాల దగ్గర తీవ్ర ఉద్రిక్త పరిణామాలు ఏర్పడ్డాయి. విషయం తెలుసుకున్న పోలీసులు కేతిరెడ్డి ఇంటి వద్దకు చేరుకున్నారు. ఆయనను అదుపులోకి తీసుకుని అనంతపురం తీసుకెళ్లారు.కేతిరెడ్డికి తాడిపత్రి వెళ్లేందుకు హైకోర్టు అనుమతి ఉంది. అయితే న్యాయస్థానం ఆదేశాలు పాటించకపోవడంతో, కొన్నిరోజుల క్రితమే ఆయన కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. ఇదిలా ఉండగానే కేతిరెడ్డి తన ఇంటికి రావడంతో తాడిపత్రి (Tadipatri) లో టెన్షన్ నెలకొంది. కేతిరెడ్డి తమకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా తాడిపత్రి రావడంపై పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో తాడిపత్రిలోని ఆయన నివాసంలోనే కేతిరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి అనంతపురం తరలిస్తున్నారు. జిల్లాలో శాంతి భద్రతల సమస్య లేకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు వెల్లడించారు.

Kethireddy Pedda Reddy:

కేతిరెడ్డిని తాడిపత్రి రాకుండా అడ్డుకుంటున్నారు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో తాను విజయం సాధించినా లేక ఓడిపోయినా సరే, తాడిపత్రిలో మాత్రం ఫ్యాక్షనిజం చేస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈక్రమంలోనే టీడీపీ నేతలు గత కొంత కాలంగా కేతిరెడ్డిని తాడిపత్రి రాకుండా అడ్డుకుంటున్నారు. దీనిలో భాగంగానే టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లోనూ కేతిరెడ్డిని తాడిపత్రికి రానివ్వబోనని గతంలో హెచ్చరించిన సంగతి తెలిసిందే. దీనిపై కేతిరెడ్డి (Kethireddy) హైకోర్టును ఆశ్రయించారు. న్యాయస్థానం ఆదేశాల మేరకే తాను తన నివాసానికి వచ్చానని, కొద్ది సేపటికే పోలీసులు తనను అదుపులోకి తీసకున్నారని కేతిరెడ్డి తెలిపారు. ఇక ఆదివారం నాడు ఆయన తన నివాసంలో ప్రత్యక్ష్యం కావడంతో, తాడిపత్రిలో పొలిటికల్ టెన్షన్ రాజుకుంది. పోలీసులు తాడిపత్రి పట్టణంలో ఎలాంటి అల్లర్లు జరగకుండా చూడటం కోసం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

Read Also: Rain: జూలై 1 నుంచి తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు

#AndhraPolitics #APBreakingNews #KethireddyPeddareddy #PoliticalTensions Ap News in Telugu Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.